ఓ చిన్నమాట!

నిరంతర ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయం సాధించాలనే మన ప్రయత్నం మనం చేయాలి. మొదటి ప్రయత్నంలోనే విజయం లభించకపోవచ్చు. కానీ ప్రయత్నం కొనసాగాలి. అది నిరంతరం కొనసాగాలి.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసే వాళ్లలో ఎవరో ఒకరు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తారు. చాలా మంది రెండవ సారి, మూడవ సారి విజయం సాధిస్తారు. మరి కొంతమంది మూడవ సారి కూడా విఫలం అవుతారు. అలాంటి వ్యక్తులు ప్రయత్నాలు కొనసాగించి స్టేట్ సర్వీస్‌లోనో, ఇతర కాంపిటీటివ్ పరీక్షల్లోనో ఎంపికవుతారు. సివిల్ సర్వీసెస్‌కి మూడుసార్లు మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది. మిగతా పరీక్షలకు అలాంటి నియమం లేదు. అందుకని ప్రయత్నం కొనసాగిస్తే ఏదో పరీక్షలో విజయం చేకూరుతుంది.
చాలామంది న్యాయవాదులు న్యాయవాదులుగా నమోదు అయిన తర్వాత జ్యుడీషియల్ పరీక్షలకి తయారవుతుంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపిక కాలేని వ్యక్తులు నిరంతరంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ సివిల్ జడ్జిగా ఎంపిక అవుతారు. సివిల్ జడ్జిగా ఎంపిక కాని వ్యక్తులు అదే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ జిల్లా జడ్జిగా ఎంపిక అవుతారు. దానికి కారణం వారి నిరంతర ప్రయత్నమే.
ఇలాంటి వ్యక్తులని చూసినప్పుడు మా చిన్నప్పుడు చూసిన వడ్డెర పని చేసిన వ్యక్తి గుర్తుకొస్తాడు. గుట్ట దగ్గరికి వెళ్లి బండలను కొట్టడం అతను చేసే పని. అతను కొట్టే బండ ఎప్పుడు పగులుతుందో అతనికి తెలియదు కానీ, బండ పగులుతుందని మాత్రం కచ్చితంగా తెలుసు. అందుకని దెబ్బ మీద దెబ్బ నిరంతరంగా అతను వేస్తూ ఉంటాడు. వంద దెబ్బలకో, రెండు వందల దెబ్బలకో ఆ బండ పగిలి అతను విజయం సాధిస్తాడు.
అక్షర జ్ఞానం లేని వ్యక్తిలో ఉన్న జ్ఞానం మనలో చాలామందిలో లోపించి మన ప్రయత్నాలు మానేస్తాం. నిజానికి మన ప్రయత్నాలు నిరంతరం కొనసాగాలి.
అప్పుడు విజయం తప్పక లభిస్తుంది.
ఇదే పరిస్థితి నీటిచుక్క విషయంలో కూడా కనిపిస్తుంది.
ఒక చుక్క
రెండవ చుక్క
మూడవ చుక్క
ఇట్లా చుక్క మీద చుక్క పడి కింద ఉన్న బండ మీద రంధ్రం చేసే దిశగా ఆ చుక్క పని చేస్తుంది.
ఈ రెండు సంఘటనలు మనకు సూచిస్తుంది ఒక్కటే.
అదే నిరంతర ప్రయత్నం.
అప్పుడు విజయం మనదే అవుతుంది.
*

జింబో 94404 83001