AADIVAVRAM - Others

సకినాలు (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా చిన్నప్పుడు కొత్త సంవత్సరం కన్నా సంక్రాంతి మీద ఇష్టం ఎక్కువ ఉండేది. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్, అప్పుడు అంతగా లేవు. సంక్రాంతి ఇష్టం కావడానికి ప్రధానమైన కారణం.. ‘సకినాలు’.
ఇప్పటిలా కాదు. సకినాలు సంక్రాంతి పండుగ ముందు మా ఇంట్లో తయారుచేసేవాళ్లు. మా ఇంట్లోనే కాదు. అందరి ఇళ్లల్లోనూ అప్పుడే తయారుచేసేవాళ్లు. ఇంట్లో ఎవరిదైనా పెళ్లి అయినప్పుడు ప్రత్యేకంగా ‘సారె సకినాలు’ చేసేవాళ్లు.
సకినాలు చేయడమనేది ఓ పెద్ద ఉద్యమంలా జరిగేది. పాత బియ్యాన్ని నానపెట్టడం, నానపెట్టిన బియ్యాన్ని దంచడం ఆ దంచడం కోసం కొందరు మనుషులు వచ్చేవాళ్లు. వాళ్లని ‘దంపకపోళ్లు’ అనేవాళ్లు. ఆ తరువాత చుట్టుపక్కల వున్న బంధువులు, స్నేహితులు వచ్చి సకినాలని తయారుచేసేవాళ్లు. కట్టెల పొయ్యి మీద వాటిని నేర్పుగా మా అమ్మ, వదిన కాల్చేవాళ్లు. ఈ కార్యక్రమం సాయంత్రం దాకా కొనసాగేది. ఆ తరువాత బంధువులకి, స్నేహితులకి పంపించడం జరిగేది. వాళ్లు అదే విధంగా పంపించేవాళ్లు. ఈ విధంగా పంపించుకోవడలో ఓ గొప్ప ఆత్మీయత ఉండేది. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి సకినాలు తయారుచేయడంలో స్నేహాలు బలపడేవి. ప్రేమలు పెరిగేవి. నెల రోజులపాటూ సకినాలతో మా సాయంత్రాలు ఆనందంగా సాగేవి.
కాలం మారింది. బియ్యాన్ని దంచడానికి మిషన్లు వచ్చాయి. కాలక్రమంలో ఇంకా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు సకినాలు చేసుకోవడం కష్టంగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలోనే కాదు, జిల్లా కేంద్రాల్లో కూడా ‘తెలంగాణ పిండి వంటలు’ లాంటి షాప్స్ వచ్చేశాయి.
సంక్రాంతికి గుర్తుగా వుండే సకినాలు ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు దొరికే విధంగా పరిస్థితులు మారిపోయాయి.
ఈ పరిస్థితి కాస్త ఆనందంగా అన్పించినా కాస్త బాధగా కూడా అన్పిస్తుంది. ఎందుకంటే సకినాలు అంటే సంక్రాంతి. సంక్రాంతి అంటే సకినాలు. ఇది తెలంగాణలోని పరిస్థితి.
చలికాలం తరువాత ఎండాకాలం. ఎండాకాలం తరువాత వర్షాకాలం వస్తాయి. అలా వస్తేనే గొప్ప ఆనందం.
ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా మారుతున్నాయి. కాలాలని మార్చడం ఇంకా సాధ్యం కాలేదు కానీ వాతావరణాన్ని మార్చేస్తున్నారు.
దానికి ఏసీలు
రిఫ్రిజిరేటర్లు
హీటర్లు ఇట్లా ఎన్నో.
మెల్లిమెల్లిగా మనిషి ప్రకృతిగా దూరంగా వెళ్లిపోతున్నాడు. ప్రకృతిని ఆస్వాదించడం మరిచిపోతూ ఉన్నాడు.
మామిడి పండు కన్పిస్తే ఎండాకాలం
సీతాఫలం కన్పిస్తే చలికాలం
సకినాలు కన్పిస్తే సంక్రాంతి గుర్తుకు రావాలి.
కానీ ఆ పరిస్థితులు మారిపోతున్నాయి.
మారిన పరిస్థితులని మనకు అనుకూలంగా మలుచుకోవడమే ఇప్పుడు మనం చేయాల్సిన పని.

- జింబో