ఓ చిన్నమాట!
రాక్షసుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాజుల కథలు, మాయలూ, మంత్రాల కథలు చదవని పిల్లలు అరుదుగా ఉంటారు. వినని పిల్లలు లేరనే చెప్పవచ్చు. ఆ కథలు చాలావరకు సుఖాంతం అయ్యేవి. మంచి విజయం సాధించేది. చెడు నశించేది. దాదాపు అన్ని కథల్లో ఇదే జరిగేది.
కొన్ని కథల్లో రాక్షసుడు వుండేవాడు. అతను రాకుమారుడి చేతిలో హతం అయ్యేవాడు. సూక్ష్మంగా చెప్పాలంటే చెడు నాశనం అయ్యేది. మంచి విజయం సాధించేది.
ఈ రాక్షసుడు అనేవాడు అందరి జీవితంలోనూ ఉంటాడు. అయితే ఆ రాక్షసుడ్ని గుర్తించి చంపే తెలివితేటలు ఉండాలి. అలా గుర్తించినప్పుడు, చంపినప్పుడు అతన్ని విజయం వరిస్తుంది.
కొంత మందిలో బద్దకం ఉంటుంది. మరి కొంతమందిలో పోస్ట్‌పోన్ చేసే అలవాటు ఉంటుంది. నా దృష్టిలో అదే రాక్షసి. దాన్ని వాళ్లు చంపగలిగితే విజయం వాళ్లను వరిస్తుంది.
నా విషయంలో కూడా ఓ రాక్షసుడు వుండేవాడు. దాన్ని గుర్తించడానికి చాలా సమయం తీసుకుంది. సైన్సు నాకు పడని సబ్జెక్టు. అది నన్ను చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బంది పెట్టింది.
నన్ను డాక్టర్ చదివించాలని ఇంటర్మీడియెట్‌లో సైన్సు గ్రూపులో చేర్పించారు. కష్టంగా చదివాను. ఇంట్లో వాళ్లకి ఎదురుచెప్పే పరిస్థితి లేదు.
మెడిసిన్ పరీక్షకి అవసరమైన మార్కులు రాలేదు. అందుకని బిఎస్సీలో చేర్పించాడు మా అన్నయ్య. ఆయన డాక్టర్. మా బాపు డాక్టర్. బిఎస్సీ అయిపోయిన తరువాత మెడిసిన్‌లో చేర్పించాలని ఆయన కోరిక. బిఎస్సీ చదవడం కష్టమైంది. అందులో కెమిస్ట్రీ చదవడం మరీ కష్టమైంది.
బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు నా జీవితంలో ఎదురైన రాక్షసుడు ఎవరో అర్థమైంది. అదే సైన్సు. బిఎస్సీ తరువాత సైన్స్‌ని చంపేశాను. అంటే సైన్సు నుంచి ‘లా’కి మారిపొయ్యాను. నా పరిస్థితి మారిపోయింది. విజయాల వైపు నా ప్రయాణం కొనసాగింది.
ఓ యాభై ‘లా’ పుస్తకాలు ఇంగ్లీషులో, తెలుగులో రాసే స్థాయికి చేరింది. ఎంతో మందికి న్యాయమూర్తులకి, న్యాయాధికారులకి, పోలీసు అధికారులకి శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకున్నాను.
అందరి జీవితంలోనూ ఒకడో, ఇద్దరో రాక్షసులు ఉంటారు.
వాళ్లని గుర్తించి మట్టుపెట్టాలి. అప్పుడు విజయం వాళ్ల చెంతన చేరుతుంది.
రాక్షసుడ్ని త్వరగా గుర్తిస్తే విజయం త్వరగా వస్తుంది.