ఓ చిన్నమాట!
‘కీ’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గ త నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ కాలమ్ రాస్తూ వున్నాను. ఎంతో మందిని ఆకర్షించింది ఈ శీర్షిక. ఇప్పటికి రెండు పుస్తకాలు వచ్చాయి. మూడవ పుస్తకం రాబోతోంది. ఈ కాలమ్ లేకపోతే ఇన్ని కథనాలు రాసి ఉండకపోయేవాణ్ణి. ఇంత మంది అభిమానులని సంపాదించుకోలేక పోయేవాణ్ణి.
మనలని ఎవరూ ముందుకు నడపరు. మనకు మనమే ముందుకు నడవాలి. మనకు ఎవరు ‘కీ’ ఇవ్వరు. మనకు మనమే ‘కీ’ ఇచ్చుకుంటూ ముందుకు నడవాల్సి ఉంటుంది. ‘చివరి గడువు’ లాంటివి కొంత ఉత్ప్రేరకంగా పని చేస్తాయి.
ఇన్ని కథనాలు ఎలా రాసానని నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. మనం కలగనడానికి కలను సాఫల్యం చేసుకోవడానికి మధ్యగ వున్నది ఒకే ఒక సన్నటి గీత. అదే మన సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామన్నది.
మనం చేయాల్సిందల్లా - చిన్నదో పెద్దదో పని చేయడం. అలా చేస్తూ పోతే మనం గొప్ప కార్యం వైపు ప్రయాణం చేస్తాం. ఓ అందమైన ఫొటోగ్రాఫ్ మొదటిసారికే రావొచ్చు, కొన్ని వందల చిత్రాల్లో ఒకటి కావొచ్చు.
ఇన్‌స్పిరేషన్ వచ్చినపుడే రాద్దామని లేదా ఏదైనా పని చేద్దామని అనుకుంటే విజయం సాధించలేరు. మనకు మనమే ఇన్‌స్పిరేషన్ తెచ్చుకోవాలి.
ఈ కథనాన్ని పంపడానికి కూడా ఓ గడువు ఉంటుంది. ఆ గడువుకన్నా ముందే పంపాలని చాలాసార్లు అనుకొని విఫలం అవుతూ వుంటాను. చివరి గడువు సమయాన రాసిస్తాను.
నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది.
ఈ కథనం ముందే రాసి ఉండవచ్చు కదా అని అన్పిస్తూ ఉంటుంది.
నిజమే!
రాసి ఉండవచ్చు. కానీ రాయలేకపోతాను. నాకు నేనే ‘కీ’ ఇచ్చుకుంటాను. చివరి గడువు నన్ను ఈ పనిని పూర్తి చేయిస్తుంది.
దేనికైనా ఓ చివరి గడువు పెట్టుకొని ప్రయాణం కొనసాగించాలి.
అంతే తప్ప ఎవరో ప్రేరణ కలిగిస్తారని వేచి చూడటం తప్పు.
అయితే - ప్రేరణ కోసం చదువుకోవచ్చు.
సంగీతం వినవచ్చు.
మనుషులని కలువవచ్చు.
ప్రయాణాలు సాగించవచ్చు.
ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి.
అదే మనకి ఎవరూ ‘కీ’ ఇవ్వరు. మనకి మనమే ‘కీ’ ఇచ్చుకోవాలి.