ఓ చిన్నమాట!

మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం పరుగెడుతూనే ఉంది.
ఈ ప్రపంచంలో అందరిని సమానంగా చూసేది, దాచుకోవడానికి వీల్లేనిది కాలమే!
సరిగ్గా 28 రోజుల తరువాత కొత్త సంవత్సరం వస్తుంది.
నిన్న గాక మొన్న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నట్లుగా ఉంది.
నిన్న గాక మొన్న కొత్త తీర్మానాలు చేసుకున్నట్టుగా ఉంది.
విచిత్రం.
అప్పుడే కొత్త సంవత్సరం పరుగెత్తుకొస్తోంది.
కాలం ఎగిరిపోతుంది.
కాలం పరుగెడుతుంది.
మనస్సుకన్నా వేగంగా కాలం పరుగెడుతుంది.
రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు
గడుస్తూనే ఉన్నాయి.
నిన్న గాక మొన్న కాలేజీ వదిలి పెట్టినట్టు, ఉద్యోగంలో చేరినట్టు ఏదో మాయ!
కాలం ఏదో మాయ చేస్తుంది. గాలి పీల్చుకోకుండా మనలని పరిగెత్తిస్తుంది.
ఎన్నో మైలురాళ్లు.
ఉద్యోగం, ప్రమోషన్, పిల్లలు, పదవీ విరమణ మరో ఉద్యోగం...
జన్మ దినాలు, వివాహ సంరంభాలు
ఇలా ఎన్నో...
కాలగర్భంలో గడిచిపోతున్నాయి.
పది సంవత్సరాలు తక్కువ సమయం ఏమీ కాదు.
సుదీర్ఘ ప్రయాణమే.
కానీ
సత్సరంగా గడిచిపోతూ ఉంది.
ఎంత మంది ఆత్మీయులని కబళించింది కాలం.
అంతా నిన్న మొన్న జరిగినట్టు,
ఏమో!
ఇదంతా కాలం చేస్తున్న మాయ.
ఈ మాయలో మనం గ్రహించాల్సింది ఒక్కటే.
ఈ సమయాన్ని ఎంత అర్థవంతంగా ఉపయోగించుకున్నామన్నది ముఖ్యం.
ఇప్పటి దాకా, అర్థవంతంగా ఉపయోగించుకోకపోతే ఇప్పటికీ సమయం మించి పోలేదు.
ఈ క్షణాన్ని అందుకు ఉపయోగిద్దాం.

- జింబో 94404 83001