ఓ చిన్నమాట!
దగ్గరి దారి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇం గ్లీష్లో ఒక కథ ఉంది. ఈ కథ చాలామందికి వర్తిస్తుంది.
ఈ కథలో ఓ యుక్త వయస్కురాలైన స్ర్తి అపస్మారక స్థితిలో వుంటే ఒక మంచి అందమైన యువరాజు వస్తాడని ఊహించుకుంటుంది. అదే విధంగా అపస్మారక స్థితిలోకి చేరుకుంటుంది. అదే స్థితిలో యువరాజు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తన కోసం అందమైన యువరాజు వస్తాడని, తనను దగ్గరికి తీసుకుంటాడని అప్పుడు తాను తిరిగి మంచి మనిషి అవుతానని అనుకుంటుంది. ఆ కథలో అలాగే జరుగుతుంది. ఆమె జీవితం అందమైన యువరాజుతో కొనసాగుతుంది.
రామాయణం లోని అహల్య కథ కూడా దాదాపు అలాంటిదే. శిలగా మారిన అహల్యని రాముడు స్పృశించగానే ఆమె తిరిగి అహల్యగా మారుతుంది. చివరికి గౌతమ మహర్షిని చేరుకుంటుంది.
1978 ప్రాంతంలో తెలుగు రాష్ట్రంలో ఇందిరాగాంధీ గాలి వీచి ఎప్పుడూ రాజకీయాల్లో లేని వ్యక్తులు అకస్మాత్తుగా శాసనసభ్యులు అయ్యారు. అదే విధంగా 1982 సంవత్సరంలో ఊహించని వ్యక్తులు అధికారంలోకి వచ్చారు. ఈ రెండు సందర్భాల్లో తప్ప మిగతా సమయాలలో చాలా కాలం కష్టపడిన వ్యక్తులే రాజకీయాల్లో మనగలిగారు.- జింబో
చాలామంది ఈ రెండు కథల్లో మాదిరిగా, ఆ రెండు సంఘటనల్లో మాదిరిగా తమ జీవితం మారుతుందని ఆశిస్తారు. అందమైన యువరాజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రాముడు లాంటి వ్యక్తి వచ్చి తమ జీవితాలని బాగుపరుస్తాడని ఊహిస్తూ కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు.
తమ బాధ్యతలని విస్మరిస్తూ ఉంటారు. ఏదో మాయ జరిగి తమ జీవితం ఆనందంగా మారుతుందని ఆశిస్తూ ఉంటారు.
నిజానికి అలాంటిది ఏమీ జరగదు. అందమైన యువరాజు రాడు. రాముడు వచ్చే అవకాశం అంతకంటే లేదు.
కఠోర శ్రమని, క్రమశిక్షణని మించిన దగ్గరి దారి లేదు.
విజయం సాధించాలంటే ఇవి రెండూ అవసరం. దైవకృప కూడా అవసరమే.
అందమైన యువతిలాగా మారకుండా వాస్తవంగా ఆలోచించాలి.
మన చర్యకి జీవితం బహుమతిని ఇస్తుంది.
మనం ఏమీ చేయకుండా ఏమీ రాదు.
ఏమీ సాధించలేం. ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
అప్పుడే వాళ్లకు దేవుడు మేలు చేస్తాడు. అనుకున్నది వాళ్లకి లభిస్తుంది.