ఓ చిన్నమాట!

ఆఖరి చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ కథారచయిత మునిపల్లె రాజుగారు మరణించారన్న వార్త ఆలస్యంగా తెలిసింది. ఆయన శనివారం చనిపోతే ఆదివారం ఉదయం వరకు నాకు తెలియలేదు. శ్రీపతిగారికి ఫోన్ చేశాను. ఆయన శనివారం నాడే మంజుశ్రీ గారితో కలిసి చూసి వచ్చానని చెప్పారు.
చివరికి రాజుగారి ఇంటికి ఫోన్ చేశాను. ఆదివారం ఉదయం 10.30 గం.ల వరకు ఆయన పార్థీవ శరీరం ఇంట్లో ఉంటుందని, ఆ తరువాత స్మశానవాటికకు తీసుకొని వెళ్తారని ఆయన కోడలు చెప్పారు.
వాళ్లు ఉంటున్నది సైనికపురిలో. నేను ఉంటున్నది పోలీస్ అకాడెమీ దగ్గర్లో. 35 కిలోమీటర్ల దూరం. సమయం ఉదయం ఎనిమిది దాటింది. ఆదివారం కాబట్టి డ్రైవర్ సెలవు తీసుకున్నాడు. ఉబర్‌లో వెళ్దామా అని అనుకున్నాను. తరువాత వెళ్లి కుటుంబ సభ్యులని చూద్దామని కూడా అనుకున్నాను.
అలా అనుకోగానే నాకు ‘మా వేములవాడ కథల’ పుస్తకంలోని సమాధానం కథ గుర్తుకొచ్చింది. ఆ కథలో ఇద్దరు మంచి స్నేహితులు ఉంటారు. ఇద్దరూ డాక్టర్లే. అందులో ఒకరు చనిపోతారు. రెండో మిత్రుడు ఆ మిత్రుడి పార్థీవ శరీరాన్ని చూడటానికి వెళ్లడు. ఆ తరువాత ఒక రోజు ఆ డాక్టర్ మిత్రుడు ఇలా సమాధానం చెబుతాడు.
‘కుటుంబ సభ్యుల మరణాలని తప్ప ఎవరి మరణాలను నేను చూడలేదు. వాళ్లు శవంగా మారిన దృశ్యాన్ని నేను ఊహించుకోలేను. నా సన్నిహితులు, స్నేహితుల ముద్ర నా స్మృతి పథంలో శవంగా ఉండకూడదని నా ఆలోచన. ఈ కారణంగానే రఘు చనిపోయిన తరువాత చూడటానికి రాలేదు. దహన సంస్కారాలకి రాలేదు. పదిహేను రోజుల తర్వాత వాళ్లని కలిసి పరామర్శించడం ఇంతకాలం చేస్తూ వస్తున్నాను. నా అభిప్రాయం సరైందేనా? అని ఎవరూ ఎప్పుడూ ప్రశ్నించలేదు. కానీ ఈ నాలుగేళ్లుగా రఘు ఈ ప్రశ్న వేస్తున్నట్టు ఫీలవుతున్నాను’ కొంచెంసేపు నిశ్శబ్దం.
‘చెప్పండి’ అంటుంది కథ చెబుతున్న పాత్ర.
ఇప్పుడు నా అభిప్రాయం మారిపోయింది. నేను ఇంతకాలం చేసింది సరైంది కాదని నాకన్పిస్తుంది. ఆఖరి చూపు విలువని నేను ఇంతకాలం తెలుసుకోలేక పొయ్యాను. మన ప్రేమని, గౌరవాన్ని వ్యక్తపరిచే సంఘటన శవాన్ని దర్శించడం, అక్కడ ఓ దండం పెట్టడం, ఓ పుష్పగుచ్ఛాన్ని ఉంచడం, వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి దుఃఖాన్ని పంచుకోవడం రఘుకి జవాబు చెప్పాను. రఘు నన్ను ప్రశ్నించడం మానేశాడు.’
ఈ వాక్యాలు నా మదిలో మెదిలాయి. రాజుగారితో చాలా సాన్నిహిత్యం ఉంది. నేనంటే బాగా ఇష్టపడేవారు. నా కథలని మెచ్చుకునేవారు. ‘పావు’ అన్న కథ ప్రాతినిధ్య కథగా పేర్కొంటూ ఇంగ్లీషులోకి అనువదించారు కూడా.
ఓ మీటింగ్‌లో పాల్గొన్నాను. ప్రతి మీటింగ్‌కి హాజరయ్యేవారు. నా కథల పుస్తకానికి ముందు మాట కూడా రాశారు. ఆయన్ని, ఆయన కథలని బాగా ఇష్టపడతాను.
అంతే!
కారు తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ మిత్రుడు మహంతి వెంకటరావుతో కలిసి సైనిక్‌పురి వెళ్లి రాజు గారి పార్థీవ శరీరానికి దండం పెట్టాను.
నా కోసమే పార్థీవ శరీరాన్ని అలా ఆపి ఉంచారని అన్పించింది. రాజుగారి భార్యతో కాస్సేపు దుఃఖాన్ని పంచుకున్నాను.
ఆఖరి చూపులో రాజుగారిని చూశాను. ఆయన నా స్మృతిపథంలో ఎప్పుడూ ఉంటారు.

- జింబో 94404 83001