ఓ చిన్నమాట!

అభ్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది రచయితలు, కవులు మూడ్ వచ్చినప్పుడు రాద్దామని అనుకుంటారు. అలాగే రాస్తామని కూడా చెబుతూ వుంటారు.
మేం రచనలు ప్రారంభించిన కొత్తలో ఓ సీనియర్ రచయిత మాకు ఓ మాట చెప్పాడు. రోజూ రాయాలి. మూడ్ అదే వస్తుంది అని.
ఆయన మాటలు మాకు ఏ మాత్రం రుచించలేదు. రోజూ రాయడం సరైంది కాదు. రాయాలన్న కోరిక బలంగా ఉన్నప్పుడే రాయాలి. ఇదేమైనా కసరత్తా అని నవ్వుకున్నాం. కొంతకాలం గడిచిన తరువాత ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉందని అన్పించింది.
రోజూ రాస్తున్నప్పుడు ప్రవాహంలా రాత కొనసాగడం గమనించాం. ఒక రోజు రాసింది. మరో రోజు కొత్తగా మారిపోయేది.
అభ్యాసం కూసువిద్య. అనగ అనగ రాగ మతిశయిల్లుచునుండు, దినగ దినగ వేము తియ్యనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన - ఇది వేమన పద్యం. ఇది అందరికీ వర్తిస్తుంది. రచయితలకు కూడా.
గాయకులు రోజూ సాధన చేస్తారు.
సంగీతకారులు రోజూ అలాగే సాధన చేస్తారు.
పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తి నిరంతరంగా పరుగుని సాధన చేస్తూ ఉంటాడు.
సైనికులు, తమ కవాతులని నిరంతరం చేస్తూ ఉంటారు.
ఎందుకు?
తమ శక్తిసామర్థ్యాలను ఇంకా పెంపొందించుకోవడానికి.
ఇంకా కొంచెం బాగు చేసుకోవడానికి.
దుస్సాధ్యమైన పనిని సులభతరం చేసుకోవడానికి.
జనవరి 26కి ముందు, ఆగస్టు 15కి ముందు, ఆ మాటకొస్తే చాలా ఫంక్షన్లకి ముందు పోలీసులు, సైనికులు ఎన్నో రిహార్సల్స్ చేస్తూ ఉంటారు.
నాటకం వేసే నటులు చాలా రిహార్సల్స్ చేస్తూ వుంటారు.
చాలాసార్లు వేయడం వల్ల పనితనం పెరుగుతుంది. లోపాలను అధిగమిస్తాం.
అందుకని సాధన అవసరం.
ఇది అందరికీ వర్తిస్తుంది.
రచయితలకి కూడా.
ఆ సీనియర్ రచయిత చెప్పినట్టు రాస్తూ పోతూ వుంటే మూడ్ అదే వస్తుంది.
చాలామంది ఈ అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు.
కానీ
ఇది వాస్తవం.

- జింబో 94404 83001