ఓ చిన్నమాట!

కరుణ (ఓ చిన్నమాట!)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి నేనూ నా మిత్రుడు కలిసి కార్లో వెళ్తున్నాం. నగరంలోని ప్రతి చౌరస్తా దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. వాహనాలు ఆపడం తప్పనిసరి. ప్రతి చౌరస్తా దగ్గర భిక్షం అడుక్కోవడానికి ఎంతోమంది. ఏసి కార్లు వచ్చిన తరువాత కారు అద్దాలు ఎప్పుడూ మూసి ఉంటున్నాయి. ఇది యాచకులకి కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. కిటికీ నుంచి చూస్తే పర్వాలేదు. వాళ్లకి ఇబ్బంది లేదు. మనం ఏదన్నా పనిలో ఉంటే మాత్రం వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. తలుపుతట్టి అడగాల్సి వస్తుంది. నేను ఏదో పేపర్ చదువుకుంటున్నాను. మా మిత్రుడు కళ్లు మూసుకొన్నాడు. నిద్రలో వున్నాడో లేదో తెలియదు. కానీ కళ్లు మూసుకొని వున్నాడు.
మా కారు పక్కన ఉన్న యాచకుడు కిటికీ అద్దాన్ని మరీ కొట్టి మమ్మల్ని కలవరపరచి డబ్బులు అడిగాడు. ఇద్దరమూ ఒకేసారి అతనివైపు చూశాం. మా డ్రైవర్‌కి కోపం వచ్చింది. తన తలుపు తీసి ఆ భిక్షగాడిని గట్టిగా కసురుకున్నాడు.
మా మిత్రుడు ఆ భిక్షగాడికి ఓ ఐదు రూపాయలు ఇచ్చి, మా డ్రైవర్‌ని మెత్తగా మందలించాడు. మా డ్రైవర్‌కి అది నచ్చలేదు.
‘మనం వాళ్ల వైపు చూసినప్పుడు అడిగితే ఫర్వాలేదు కానీ మరీ కిటికీ అద్దాలని కొట్టి అడగటం ఏమీ బాగా లేద్సార్’ అన్నాడు.
‘నిజమే! నువ్వన్నది సరైందే! కానీ వాడి యాతన వాడిది. మనం డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. కానీ కసురుకోకూడదు’ అన్నాడు.
ఇంకా ఇలా చెప్పాడు.
‘ఎవరితోనైనా కొంత దయతో వ్యవహరించాలి. దానికి మనం ఖర్చు పెట్టాల్సింది ఏమీ లేదు. పేదవాళ్లకి విపరీతమైన డబ్బులు ఇస్తేనే దయతో వ్యవహరించినట్టు కాదు. మన కుటుంబ సభ్యుల పట్ల స్నేహితుల పట్ల బంధువుల పట్ల అందరి పట్ల దయతో ఉండాలి.
పెద్దపెద్ద దానధర్మాలు చేస్తేనే అది దయతో కరుణతో ఉన్నట్టు కాదు. ప్రశాంతంగా, విసుగు లేకుండా మాట్లాడటం కూడా కరుణే. అమ్మకి తన పనిలో సహాయం చేయడం, నాన్నకి తన పనిలో కొంత వెసులుబాటు కల్పించడం కరుణే. ప్రేమపూర్వకంగా మాట్లాడటం కరుణే. ఇతరులు చెప్పేది కాస్త ఓపిక చేసుకొని వినడం కరుణే.
మన పట్ల మనం కూడా దయతో వుండాలి. మన అవయవాల పట్ల, మన హృదయం పట్ల కరుణతో ఉండాలి. మనకి మనం కొంత సమయాన్ని వెచ్చించి వినడమూ కరుణే.
దేవున్ని ప్రార్థించినప్పుడూ అందరికీ మంచి జరగాలని ప్రార్థించడమూ కరుణే.
దయతో వుండటాన్ని ఓ అలవాటుగా అభ్యాసం చెయ్యాలి. మనపట్ల మనం దయతో వుంటే మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరుల పట్ల దయతో వుంటే ఆనందం లభిస్తుంది. కరుణ అనేది ఓ గొప్ప అనుభూతి. ఇవ్వడమూ ఆనందమే.

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు కూడా పంపించవచ్చు.

-జింబో 94404 83001