ఓ చిన్నమాట!

మారిన ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత నవంబర్ నెలలో కుటుంబ సభ్యులతో కలసి సింగపూర్ వెళ్ళాను. చాలా చిన్నదేశం, అతి తక్కువ సమయంలో అంతగా అభివృద్ధి చెందడం గొప్ప ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. అక్కడికి ఆర్కిటెక్చర్ నైపుణ్యాన్ని చూసి విభ్రమం చెందాల్సిందే. పార్క్‌లు, అక్వేరియమ్‌లు, జంతు ప్రదర్శనశాలలు ఒకటేమిటీ ఇలా ఎన్నో.
హైదరాబాద్‌లాంటి నగరాలు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి వుందని అన్పిస్తుంది. హైదరాబాద్ మహానగరం అయినప్పటికీ ఆడవాళ్ళు ఇంకా భయం భయంగానే బతుకుతున్న పరిస్థితి మనకు కన్పిస్తుంది.
ఈ విషయంలో కూడా సింగపూర్ మనకన్నా చాలా ముందుంది. మన నగరంలో పెట్రోలు బంకుల్లో ఆడ ఉద్యోగులు కన్పిస్తున్నారు. అక్కడ క్యాబ్‌లని నడిపిస్తూ యువతులు కన్పిస్తున్నారు.
ఒకరోజు ఉదయం మేం క్యాబ్ బుక్ చేశాం. ఓ అందమైన యువతి క్యాబ్‌ని నడుపుకుంటూ వచ్చింది.
మేం ప్రయాణం చేస్తున్నాం. మా ఆవిడికి వాళ్ళ రక్షణ గురించి సందేహాలు వచ్చాయి. ఆమెతో సంభాషణ మొదలుపెట్టింది.
‘‘పీజీ చేశావా?’’ అడిగింది.
‘‘అవును’’ నమత్రగా చెప్పింది.
‘‘మరి ఈ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకున్నావెందుకని’’ అడిగింది.
‘‘డ్రైవింగ్ నాకిష్టం. కొన్ని రోజులు ఇలా నడపాలని అనుకున్నాను. ప్రతి ఉద్యోగానికి గౌరవం వుంది. నాకీ ఉద్యోగంలో సంతృప్తి కన్పిస్తుంది’’ చెప్పింది.
‘‘భయం లేదా? మగవాళ్ళతో’’ మళ్లీ ప్రశ్న.
నవ్వింది ఆమె.
‘‘కష్టపెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు అంతటా వున్నారు మేడమ్. నా జాగ్రత్తలు నాకున్నాయి. ఈ కారులో కూర్చున్న వాళ్ళతోబాటూ, వాళ్ళ మాటలు చేష్టలు అన్నీ వీడియో రికార్డు అవుతూ వుంటాయి. మీరు గమనించలేదని అనుకుంటాను. నా ప్రక్కన కెమెరా ఉంది’’ జవాబు చెప్పింది.
అపుడు చూశాం అందరం. అక్కడ కెమెరాలో అంతా రికార్డు అవుతూ వుంది.
ఆమె ధైర్యానికి ఆనందం వేసింది. సూటిగా జవాబులు చెప్పడం ఆమె మీద గౌరవాన్ని పెంచింది.
మా గమ్యం వచ్చేసింది.
‘‘గాడ్ బ్లెస్ యూ’’ అని మా ఆవిడ కారు దిగింది. మేమూ దిగాం.
ఆమె కదిలింది. ఎంత బాగా సమాధానాలు చెప్పింది. కాలం ఎంత మారింది. కాలమే కాదు, ఆలోచనలు కూడా.
*

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001