ఓ చిన్నమాట!

చిన్న చిన్న పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న చిన్న పనులు మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
మనం టూర్‌కి వెళ్లినప్పుడు లాడ్జిల్లో, గెస్ట్‌రూంల్లో దిగుతాం. మనకు ఇచ్చిన రూం చాలా పరిశుభ్రంగా, అందంగా అలంకరించి ఉంటుంది. రాత్రి పడుకొని, తెల్లవారి లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ నగరంలో ఉన్న వింతలు, విశేషాలని చూడటానికి వెళతాం. సాయంత్రం ఎప్పుడో తిరిగి వస్తాం.
మన బెడ్ అందంగా అలంకరించి ఉంటుంది. చెల్లాచెదురుగా పడేసిన కేటిల్, టీ పాకెట్లు అన్నీ కుదురుగా ఉంటాయి. మనం తిరిగిన అలసట అంతా పోయే విధంగా మన రూంలోని వాతావరణం ఉంటుంది.
మన ఇంటి పరిస్థితికి వస్తే గతంలో ఓ రెండు బల్లలు, నవారు మంచాలు, నులకమంచాలు ఉండేవి. ఇప్పటి మాదిరిగా డబుల్ బెడ్‌కాట్లు లేవు. ఉదయానే్న ఇంట్లోని పెద్దవాళ్లు మన దుప్పట్లని, పరుపులని జాగ్రత్తగా బల్లల మీద అమర్చిపెట్టేవాళ్లు. మంచాలని పైకి ఎత్తి ఉంచేవారు. ఇప్పటి మాదిరిగా మంచాల మీద పడి దొర్లడం అప్పుడు ఉండేది కాదు.
ఇప్పుడు కాలం మారిపోయింది. కూర్చోవడం మర్చిపోయారు. పిల్లలు, పెద్దవాళ్లు ఇంటికి రాగానే అందరూ మంచాల మీద పడిపోతున్నారు. స్మార్ట్ఫోన్లకి, డబుల్‌కాట్లకి అతుక్కుపోతున్నారు. కానీ ఉదయం లేవగానే బెడ్‌ని సర్దుకోరు. బెడ్‌షీట్లు అలాగే నలిగి ఉంటాయి. కప్పుకున్న దుప్పటిని కూడా తీసి మడతవేసి పెట్టరు. చాలా మంది ఇళ్లల్లో ఇదే పరిస్థితి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే వాళ్ల బెడ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
ఒక్క ఐదు నిమిషాలు కేటాయించి బెడ్‌రూంని, కాట్‌ని సర్దుకోరు.
హోటల్ రూం శుభ్రంగా ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో, మన బెడ్‌రూమ్‌ని సర్దుకొని, శుభ్రంగా ఉంచుకుంటే అంతకు మించిన ఆనందం ఉంటుంది.
ఇది ఒక చిన్న పని.
చిన్న చిన్న పనులని అశ్రద్ధ చేయకూడదు. చిన్న చిన్న పనులే గొప్ప ఆనందాన్ని కలుగజేస్తాయి.
ప్రతి ఉదయం ఓ ఐదు నిముషాలు సమయం కేటాయిస్తే, మనం విసుగుతో అలసిపోయి ఇంటికి రాగానే మన మనస్సుని ఆహ్లాదపరుస్తుంది.
అందుకే చిన్న చిన్న పనులని చేస్తూ ఉండాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001