ఓ చిన్నమాట!

మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో చాలా జంతువులు అంతరించిపోతున్నాయి. అందుకు కారణాలు ఎన్నో.
మారుతున్న పరిస్థితులకి తగినట్టు అని మార్పు చేసుకోకపోవడం కూడా ప్రధాన కారణం.
చాలామంది మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా మారకుండా ఉంటారు. చాలా విషయాల్లో అదే విధంగా ప్రవర్తిస్తుంటారు. మార్పుని గమనించాలి. మారిన పరిస్థితుల ప్రకారం మసలుకోవాల్సి వుంటుంది.
మన దేశంలో మనకి స్తోమత ఉంటే చాలామంది పనివాళ్లని పెట్టుకోవచ్చు. ఈ పరిస్థితి అమెరికాలో వుండదు. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే అన్ని పనులని వాళ్లే చేసుకుంటారు. మనం మన పిల్లలని చూడటానికి వెళ్లినప్పుడు మన పనులని మనమే చేసుకోవాల్సి వస్తుంది.
నేను తిన్న పళ్లెం నేను ఎప్పుడూ తీయలేదు. అమెరికాలో కూడా తీయను అంటే కుదరదు. అక్కడ పొసగక భారతదేశానికి తిరిగి రావల్సి వస్తుంది.
బ్యాంకు లావాదేవీలు ఇప్పుడు మారిపొయ్యాయి. ఇంట్లో వుండి ఎన్నో పనులు చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్త అవసరం అంతే కానీ కష్టం కాదు. నేను నేర్చుకోను. గతంలో మాదిరిగా ఉంటానని అనుకుంటే చాలా పనులు కష్టమై పోతాయి.
కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లులు గతంలో మాదిరిగా ఆ ఆఫీసుల్లోకి వెళ్లి చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇంట్లో వుండి స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లించవచ్చు. అయితే ఆ ఫోన్‌ని ఉపయోగించుకోవడం అలవర్చుకోవాలి. మారిన పరిస్థితులకి అనుగుణంగా మారాలి. నేను మారను అనుకుంటే కష్టపడేది మనమే. ఆయా ఆఫీసుల్లోకి వెళ్లి చెల్లించడం వల్ల సమయం, డబ్బూ రెండూ వృధా అవుతాయి.
మార్పు చేసుకోవడం అనేది అంత సులువు కాదు. కానీ అది అత్యంత అవసరం.
కొత్త అలవాట్లని, కొత్త దృక్పథాలని మార్చుకోవడం కొంత కష్టమే. కానీ తప్పదు.
ఎందుకంటే మన ప్రపంచం ప్రతిరోజూ మారిపోతుంది. కొత్తకొత్త సాంకేతిక విషయాలు మన జీవితంలోకి చొచ్చుకొస్తున్నాయి. వాటికి అనుగుణంగా మనం మారాలి.
ఈ విధంగా మార్పు చేసుకోని వ్యక్తులు చాలా కష్టపడతారు. ఇతరులని కష్టపెడతారు.
పాత అలవాట్లని మార్చుకోవడం అంత సులువు కాదు.
కానీ తప్పదు.
మార్చుకోవడం వల్ల ఎదుగుదల ఉంటుంది.
ఎదుగుదల కూడా ఐచ్ఛికమైనది కాదు. మన జీవితాలని మార్చడానికి, మంచిగ చేసుకోవడానికి ఏదో కొంత కృషి చేయాలి.
ఈ కృషి ఎక్కువగా మన కోసమే.

-- జింబో 94404 83001