పాటల్లో.. ఓ కల్పన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విషురెడ్డి, వర్ధన్‌రెడ్డి, ఐరా ప్రధాన పాత్రల్లో మహంతి పి.కె. దర్శకత్వంలో కొండ్రెడ్డి సతీష్‌చౌదరి నిర్మిస్తున్న ‘వాడు వీడు ఓ కల్పన’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణా సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సీడీని ఆవిష్కరించి, ఎ.పి. మంత్రి మాణిక్యాలరావుకు అందజేశారు. అనంతరం తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ, సతీష్ లాంటి యువ నిర్మాతలు సినిమాలు తీయాలని, తెలుగులో చిన్న చిత్రాలు మరిన్ని రావాలని, హైదరాబాద్‌లో తెలుగు పరిశ్రమ ఘనంగా వర్ధిల్లాలని, సినిమా అంటేనే హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మాణిక్యాలరావు మాట్లాడుతూ, ఈ సినిమా ఘన విజయం సాధించాలని, మహంతి దర్శకుడు కావడం ఆనందంగా వుందని అన్నారు. హీరో సుమన్ మాట్లాడుతూ, పాటలు, ఫొటోగ్రఫీ బాగుందని, చిన్న సినిమాలకు ప్రభుత్వం సపోర్ట్ అందించాలని అన్నారు. హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ, తను చేసిన సినిమాలకు మహంతి పనిచేశాడని, తను దర్శకుడు కావడం ఆనందంగా వుందని అన్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి అని అన్నారు. చిత్ర దర్శకుడు మహంతి మాట్లాడుతూ, దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశానని, కొత్తవాళ్లతో సినిమా చేస్తున్నానని, అందరికీ నచ్చే అన్నిరకాల అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల చేస్తామన్నారు.