రివ్యూ

నిష్ఫల ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*ఓ స్ర్తి రేపురా! (బాగోలేదు)

తారాగణం:
అశిష్‌గాంధీ, వంశీకృష్ణ, కునాల్‌కౌశిక్, దీక్షాపంత్, శ్రుతిమోల్, మనాలీ తదితరులు.
సంగీతం:
విశ్వనాథ్ ఘంటశాల
నిర్మాణం:
రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్
కథ, దర్శకత్వం:
అశోక్ రెడ్డి

ఆమధ్య సుప్రసిద్ధ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ -పెద్దపెద్ద లాభదాయక ఉద్యోగాలు వదిలేసి సినిమామీద తగని మక్కువతో వచ్చి చిత్రాలు తీయడం స్వాగతించతగ్గదే! కానీ అలా వచ్చేవారు సినిమా సంగతులు గురించి కాస్తంత అధ్యయనం చేసి వస్తే బావుంటుంది అన్న సూచన చేశారు. అలాంటి సూచన సరిగ్గా ఈ చిత్ర దర్శకుడికి అవసరమని చిత్రం చూసిన తర్వాత తక్షణం అనిపించిన అభిప్రాయం. ఈ సినిమా విషయంలో జరిగిన ఇంకో పక్కదారి పట్టించే విషయం ఏమిటంటే.. చిత్ర ప్రచారం చూసి ఇదేదో ఈమధ్య చిత్రాల సరళిలో వస్తున్న దెయ్యాల చిత్రంగా అనుకుంటాం. కానీ నేపథ్యం దెయ్యానిదే కానీ, ఆ బాపతు వికృతాంశాల శాతం తక్కువే! ఇక కథ విషయానికెళ్తే.. కథలు రాసే అభిరుచిగల వౌనిక ఓ సంపాదకుడి ప్రోద్బలంతో కొంతకాలం క్రితం కొన్ని ప్రాంతాలలో దెయ్యాల భయంతో ‘‘ఓ స్ర్తి రేపురా’’ అని గోడలమీద రాసే అలవాటు ఆలంబనగా కథ రాస్తుంది. ఆ రాసే సందర్భంలో ఆమె తెలుసుకున్న విషయాలు, ఎదుర్కొన్న అంశాలూ తదితరాలతో ఇతివృత్తం నడుస్తుంది. వాస్తవానికి ఈ చిత్రం గురించి చెప్పిన అంశాలలో ఉన్నట్లు ఇలా ‘‘ఓ స్ర్తి రేపురా...’’ అని రాసే ప్రక్రియ ఆయా ప్రాంతాలలో 1980కి ముందునుంచే ఉంది. కానీ వాటి నిజానిజాల నిగ్గుతేల్చిన వైనం లేదు. అసలు ఈ కథని ఇలా వౌనిక, ఆమె ప్రేమికుడు, కథలో ప్రధానమైన ఇంకో కథ-కల్యాణి-శీను అంటూ రెండూ సమాంతరంగా నడపటంతో ప్రేక్షకుల్లో కావల్సినంత గందరగోళం ఏర్పడింది. అలాంటి కన్‌ఫ్యూజన్‌వల్ల సినిమాలో సన్నివేశాలూ పండలేదు. దానికితోడు పాత్రల్ని నడిపించిన అత్యంత అవాస్తవిక ధోరణులు చిత్రాన్ని ఇంకాస్త పలచన చేశాయి.
ఉదాహరణకి కల్యాణి ప్రేమించిన శీను పాత్రని తీసుకుందాం. ఓ జమీందారీ నేపథ్యం ఉన్న అబ్బాయిగా అతన్ని చూపారు. కానీ అతను ఓ పనికిమాలిన గాంగ్‌తో పత్తాలు ఆడుకుంటూ, బీడీలు కాలుస్తూ వుండే జీవన సరళితో ఉంటాడు. మరి అలాంటి వ్యక్తిని కల్యాణి ఇష్టపడడం, వెంట పడడం, వగైరాలు ఏ విధంగానూ కథావిధానానికి అతకని అంశాలు. అలాగే పట్టణాల్లో అంటే అమ్మాయి రాకపోకలు గజిబిజి వ్యవస్థలో కుదిరే విషయం కాకపోవచ్చు. కానీ గట్టిగా ఓ వంద గడపలు కూడా లేని గ్రామంలో కూడా అమ్మాయి సంగతి గుర్తించని రీతిలో ఈ చిత్రంలోలా తండ్రి ఉంటాడా? అన్నది అంతుపట్టని అంశం. ఇలాంటి అంశాలెన్నో ఇందులో ఉన్నాయి. నటీనటుల్లో కాస్తంత కల్యాణి పాత్రధారిణే బెటర్ పెరఫార్మెన్స్ ఇచ్చింది. శీను పాత్రధారి తమిళ నటుణ్ణి అనుకరించే ప్రయత్నం చేశారు. మిగిలిన పాత్రధారులు మామూలే! చిత్రం ప్రారంభంలో పబ్లిషర్ పాత్ర ప్రస్థావించినట్లు ఒకరు రాసిన ఐడియాతో అంతకుముందే సాహిత్య జగతిలో వచ్చిన సంగతులు అనేకం ఉన్నాయి. వాటిని గూర్చి వివరంగా ఇందులో ప్రస్తావిస్తే కొత్తదనం కనపడేది. అలాగే కల్యాణి- తండ్రి సంభాషణల్లో కొద్దిగా మనసుకి పట్టే అంశాలు వస్తున్నాయని భావిస్తుంటే దాన్ని అర్ధాంతరంగా ఆపేశారు. పాటల్లో ఏదీ చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు. కనీసం నేపథ్య సంగీతంలోనైనా నవ్యత్వం ఉంటుందనుకుంటే వాటిల్లోనూ అనేకానేక పాప్యులర్ ట్రాక్‌లు వినిపించాయి. పలు చిన్న సినిమాల విషయంలో దృశ్యం, శబ్దం అంశాల పట్ల చూపే చిన్నచూపు ఈ చిత్రం విషయంలోనూ జరిగింది. ఎప్పుడో అశోకుడు కాలంనాటి కథలతో కాకుండా కాలంతో కలసివచ్చే కథలలోను స్టోరీలైన్‌గా అశోక్‌రెడ్డి (చిత్ర దర్శకుడు) అనుకుని చిత్రం అందించి వుంటే సత్ఫలితాలకోసం రేపటివరకూ ఆగక్కరలేకుండా ఉండేది.

-అన్వేషి