అంతర్జాతీయం

కలసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణ మార్పుపై చైనాకు స్పష్టం చేసిన ఒబామా

పారిస్, నవంబర్ 30: ప్రపంచానికి పెనుసవాల్‌గా పరిణమించిన వాతావరణ మార్పులపై కలిసి పోరాడదామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనాకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత మనదేనని ఇక్కడ జరుగుతున్న శిఖరాగ్ర సదస్సులో ఆయన పిలుపునిచ్చారు. సైబర్ సెక్యూరిటీ, మారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి చైనా అధ్యక్షుడు జి జింపింగ్‌తో అభిప్రాయ భేదాలున్నప్పటికీ భూతాపాన్ని తగ్గించుకోవడానికి పరస్పరం సహహరించుకుందామని అమెరికా స్పష్టం చేసింది. తూర్పు చైనా సముద్రం, పశ్చిమ చైనా సముద్రం జలాల వివాదంపై ఒబామా అనేక పర్యాయాలు చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే పారిస్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ ‘పర్యావరణ మార్పుపై మనం ఇద్దరం ఎలాంటి దాపరికం లేకుండా చర్చించుకుందాం’ అని చైనాకు స్పష్టం చేశారు. చైనా అధ్యక్షుడు జి జింపింగ్‌తో సమావేశం ఈ దిశగా ఫలప్రదం అవుతుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. (చిత్రం) పారిస్‌లో చైనా అధ్యక్షుడు జింపింగ్‌తో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు ఒబామా