ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో చేరిన ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అధికార తెలుగుదేశంలోకి విపక్ష ఎమ్మెల్యేల వలసల జోరు కొనసాగుతోంది. వైకాపాకు చెందిన విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గురువారం ఉదయం ఇక్కడ సిఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టిడిపిలో చేరారు. ఉదయం 9-05 గంటలకు మంచి ముహూర్తంగా భావించి బుడ్డా టిడిపి అధినేతను కలిసి కండువా వేయించుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, పరవాడ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టిడిపిలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరింది.