రాష్ట్రీయం

దర్యాప్తు అధికారిని తప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తుల వేలాన్ని 15రోజుల్లో పూర్తి చేయండి
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు ఆదేశం
నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని సిఐడిపై ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిపాజిటర్లను, ఏజెంట్లను నిండా ముంచిన అగ్రిగోల్డ్ కంపెనీ మోసం కేసులో నిందితులను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని రాష్ట్ర హైకోర్టు సిఐడి అధికారులపై మండిపడింది. కేసు నమోదు చేసి చాలా రోజులైనా ఇంతవరకు సంబంధిత నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని విచారణ అధికారిని ప్రశ్నించింది. సోమవారం అగ్రిగోల్డ్ బాధితుల పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే దర్యాప్తు అధికారిని తప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కనీసం ఈ కేసులో నిందితులు ఎంతమందిని ప్రశ్నించారని అడిగింది. నిందితుల ఆస్తుల వేలాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని కూడా ప్రశ్నించింది. 15 రోజుల్లోగా వేలం నిర్వహణ పూర్తి చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హైకోర్టు గతంలో హామీ ఇచ్చింది. ఇందుకు కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని హైకోర్టు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. లావాదేవీల కోసం రిజిస్ట్రార్ పేరుతో అక్కౌంట్ ప్రారంభించాలని, మొదటివిడతగా 14, రెండో విడతగా 5 ఆస్తులు అమ్మకం జరగాలని కోర్టు ఇదివరకే సూచించింది. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోడంతో విచారణ అధికారుల తీరు సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘వలస కార్మికుల భద్రతపై నివేదిక ఇవ్వండి’
హైదరాబాద్, డిసెంబర్ 21: ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో వలస కార్మికుల అందుతున్న పనులు, వారి భద్రతకు సంబంధించి తగిన నివేదిక ఇవ్వాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కార్మికులకు అందుతున్న సౌకర్యాలు, భద్రత, వేతనం వంటివి ఎలా ఉన్నదీ వివరిస్తూ నివేదికను కోర్టుకు అందజేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఒడిస్సా రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం సూచనల మేరకు హైకోర్టు ఈ ఆదేశాలు ఇస్తూ ఇరు ప్రభుత్వాలు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.