తెలంగాణ

జంతు కళేబరాలతో నూనె తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ముఠా కోసం గాలింపు

కొత్తూరు, డిసెంబర్ 19: ఎముకలు, జంతు కళేబారాలతో అక్రమంగా కల్తీ నూనె తయారు చేసే స్థావరంపై శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు పోలీసులు దాడి చేసి కల్తీనూనె ఉన్న 43 డ్రమ్ముల పాటు జంతు కళేబరాలు, ఎముకలు, తయారుచేసే వస్తువులను స్వాధీన చేసుకొని విచారణ జరుపుతున్నారు. మండలం సిద్దాపూర్ గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్‌లో రహస్యంగా జంతు కళేబారలతో కల్తీనూనె తయారు చేస్తున్న స్థావరంపై కొత్తూరు పోలీసులు దాడి జరిపిన సమయంలో అక్కడ తయారుచేసే నిర్వాహకులెవరూ కనిపించలేదు. 43 డ్రమ్ముల కల్తీనూనెతోపాటు తయారుచేసే వస్తువులను స్వాధీన పరుచుకుని పంచనామా జరిపి కేసు నమోదు చేశారు. దాడి చేసిన ప్రాంతంలో రోడ్డు ముందు ఫామ్‌హౌస్ లోపల భాగం కల్తీనూనె తయారుచేసే స్థావరాన్ని పోలీసులు కనుగొన్నారు. హైద్రాబాద్ ఇతర ప్రాంతాల నుండి పశువుల ఎముకలు, కళేబారాలు ఇక్కడికి తీసుకువచ్చి కల్తీనూనె తయారు చేసి హైద్రాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు రాత్రి సమయంలో దాడి జరుపుతున్నారని సమాచారం తెలుసుకున్న నిర్వాహకులు పరారయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో కల్తీనూనె తయారీ బట్టీలలో మంటలు కనిపించాయి. దీన్ని బట్టి నిర్వాహకులు కల్తీనూనె తయారు చేయు సమయంలో సమాచారం తెలుసుకుని పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ కల్తీనూనె తయారీ గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుందా? లేక ఇటీవలే ప్రారంభమైందా? అనే విషయాలను పోలీసుల విచారణలో తేలనుంది. రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్‌ను వివరణ కోరగా కల్తీనూనె తయారు చేయుటలో ఎంతమందికి సంబంధం ఉంది? అనే విషయం పూర్తిగా చెప్పలేమని, వీరంతా పరారీలో ఉన్నారంటూ సమాధానం చెప్పకుంటూ దాటవేశారు.