రివ్యూ

అనగనగా అదే చిత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*అనగనగా ఒక చిత్రం (బాగోలేదు)

తారాగణం:
శివ, మేఘాశ్రీ, షాయాజీ షిండే, వెనె్నల కిషోర్, ప్రభాస్ శ్రీను, జోగి బ్రదర్స్, పృథ్వీ తదితరులు
సంగీతం: వినోద్ యాజమాన్ నిర్మాతలు:
ప్రభాకర్‌రెడ్డి, సుబ్బారావు
దర్శకత్వం:
చందు ముద్దు

పద్మాలయ స్టూడియో మల్లయ్యగా మంచి గుర్తింపున్న శాకమూరి మల్లికార్జునరావు తనయుడు శివను హీరోగా పరిచయం చేస్తూ ‘జగన్ నిర్దోషి’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు ‘అనగనగా ఒక చిత్రం’తో మరోసారి హీరో అయ్యాడు. ప్రేమకథా చిత్రం దర్శకుడు జె ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ మేఘశ్రీ.
వీళ్లిద్దరి ప్రేమాయణం ఏంటో చూద్దాం.
చిన్నా చితకా పనులు చేసుకునే అనాధ కుర్రాడు సోమరాజు (శివ). సినిమా పిచ్చితో తిరుగుతున్న పిచ్‌కాక్ (ప్రభాస్ శీను)తో కలిసుంటాడు. పరిమళాదేవి అలియాస్ చిట్టి (మేఘశ్రీ)ని ప్రేమిస్తుంటాడు సోమరాజు. సోమరాజుతో చిట్టి క్లోజ్‌గానే ఉన్నా, ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు. సోమరాజు మాత్రం చిట్టి ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? అని ఎదురుచూస్తూ, ఆమె ఇబ్బందులను క్లియర్ చేస్తూ ఉంటాడు. ఓసారి చిట్టికి 7కోట్లు అవసరం పడుతుంది. ఆ భారం సోమరాజుపై పడుతుంది. దానికోసం ఏంచేయాలా? అని ఆలోచిస్తున్న టైంలో సోమరాజు మామ పిచ్‌కాక్ జీవితాన్ని మార్చేసే ఐడియా ఇస్తాడు. అదేమిటంటే -సోమరాజు పనిచేసే పబ్‌కి రోజూవచ్చే లక్షాధిపతి రణవీర్‌సింగ్ (షాయాజీషిండే)ని కిడ్నాప్ చేయాలని. అనుకున్నదే తడవు చేసేస్తారు. తర్వాత అసలు నిజం తెలుస్తుంది. రణవీర్‌సింగ్ హైదరాబాద్ సిటీ డిజిపి అని. దాంతో భయపడి అతన్ని వదిలేయాలనే ఆలోచనలో ఉండగా -చాలా తప్పులు జరిగిపోతాయి. డిజిపి, సోమరాజు గ్యాంగ్‌ని నక్సల్ లీడర్ క్రాంతివీర్ కిడ్నాప్ చేస్తాడు. డిజిపిని వదిలేందుకు గవర్నమెంట్‌కి కొన్ని డిమాండ్లు పెడతాడు. ఆ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం డిమాండ్స్‌ని తీర్చి డిజిపిని బయటకి తీసుకొచ్చిందా? లేక సోమరాజు మరేదైనా ప్లాన్‌వేసి తప్పించుకున్నాడా? అనేది తెరపై చూడాల్సిందే.
రొటీన్‌గా వచ్చే కామెడీ ఎంటర్‌టైనర్ జానర్లో వచ్చిన సినిమానే ఇది. ఇలాంటి సినిమాల్లో కథ, కథనం బాలేకున్నా కాస్తోకూస్తో బాగుందనిపించేది కొన్ని కామెడీ బిట్లు. అదేరీతిలో ఈ సినిమాకి కాస్తోకూస్తో సహాయపడింది కామెడీనే. హీరో కావాలని రంపచోడవరం నుంచి హైదరాబాద్‌కి వచ్చిన వెనె్నల కిషోర్ పాత్ర ఒకింత నవ్విస్తుంది. తనకి రాసిన వన్‌లైన్ డైలాగ్స్ బాగానే పేలాయి. ఇకపోతే సెకండాఫ్‌లో రచ్చ రాంబాబు పాత్రలో పృథ్వీ పంచ్ డైలాగ్స్, జోగీ బ్రదర్స్, ప్రభాస్ శీను పంచ్‌లు బాగానే నవ్విస్తాయి. అలాగే సెకండాఫ్‌లో నక్సల్స్ గురించి సూర్య చెప్పే డైలాగ్ సీన్ బావుంది. హీరో శివ, హీరోయిన్ మేఘశ్రీలకు సినిమాలో చేయడానికి ఏమీలేదు కాబట్టి, నటనా ప్రతిభను ప్రదర్శించే ప్రయత్నాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు.
టెక్నికల్‌గా సినిమాను నిలబెట్టేంత విషయం కూడా ఆడియన్స్‌కు కనిపించదు. స్టోరీ, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ ప్రభాకర్ రెడ్డి చూసుకున్నాడు. ఈ మూడింటిలోనే కాదు, సీన్స్ రాసుకున్న విధానం, నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టడంలో పడిన కష్టం ఫలించలేదు.
సంభాషణలు అక్కడక్కడా పేలాయి. వినోద్ యాజమాన్య అందించిన సాంగ్స్ సందర్భానుసారంగా రాకున్నా, జస్ట్ ఓకే అనిపించాయి. నేపథ్య సంగీతం చాలాచోట్ల సంభాషణలను డామినేట్ చేసేసింది. ప్రభాకర్‌రెడ్డి-కొడాలి సుబ్బారావు నిర్మాణ విలువల గురించి తప్ప, మిగిలిన సాంకేతిక విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేంత విషయం సినిమాలో కనిపించదు. కథ ఎక్కడో మొదలై ఎక్కడో ముగియడంతో -క్లారిటీ మిస్సైంది. ఆడియన్స్‌ని మెప్పించడంలో విఫలం అయ్యింది.

-త్రివేది