రివ్యూ

ఒకటే.. బోర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒక్కడితో మొదలైంది (బాగోలేదు)

తారాగణం:
మోహన్ తెలుగు, మాన్య, సుమన్, ధన్‌రాజ్, శ్రీష, లావణ్య, చిట్టిబాబు
సినిమాటోగ్రాఫర్:
శ్యామ్‌ప్రసాద్ దూపటి
నిర్మాతలు:
బి.మోహన్
దర్శకత్వం:
మొగిలి నాగేశ్వర్‌రావు

చాలావరకూ ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నా.. పక్కన నలుగురుండాలి కాబట్టి ఉన్నారన్నట్టుగా ఆలోచిస్తే ఆ పని సాధించడం గగనమే. అలా సాధించే ప్రయత్నంలో వర్మ అనే యువకుడు ఏం చేశాడు? అనే కథతో చిత్రం సాగింది.
కథేంటి?
స్నేహితులతో కలిసి బ్యాచిలర్ జీవితం గడిపేస్తుంటాడు వర్మ (్ధన్‌రాజ్). ఫ్రెండ్ గోపాల్‌కేమో విదేశీ ఉద్యోగం మోజు. మరో ఫ్రెండ్‌కు తండ్రికి ఆపరేషన్ చేయించాల్సిన బాధ్యత. డబ్బుకోసం ముగ్గురూ చాలా ప్రయత్నాలు చేస్తారు. చివరికి భిల్లన్న అనే చోటా రౌడీ దగ్గర అప్పుచేస్తారు. ఆ డబ్బు నలుగురు దొంగలు కాజేస్తారు. ఆ గొడవలో పూరి అనే స్నేహితుడు చనిపోతాడు. హత్యానేరం తమపై పడుతుందన్న భయంతో ముగ్గురు స్నేహితులు ప్రియురాళ్ళతో కలిసి అడవిలోకి పారిపోతారు. అక్కడ స్పిరిట్ గేమ్ అంటూ వర్మ దెయ్యాలను పిలిచే ఆట ఆడదామంటాడు. ఆ ఆటలో అక్షర అనే దెయ్యం గోపాల్ ప్రియురాలు అమలను ఆవహించి, తనను హత్య చేసిన నలుగురు హంతకులను చంపమని ప్రాధేయపడుతుంది. డబ్బు దొంగిలించిన నలుగురు దొంగలే హంతకులని తేలుతుంది. హంతకులను స్నేహితులు ఎలా పట్టుకున్నారు? చివరికి పోలీసులు వారినేం చేశారు? అనే కథనంతో సినిమా సాగింది.
ఎలా వుంది?
మొత్తం డ్రామా నడిచినట్లుగా సినిమా సాగుతుంది. సరైన పాత్రలు కాని, వాటి వ్యక్తిత్వాలు కాని కన్పడవు. ఒక్క వర్మ వ్యక్తిత్వాన్ని విచిత్రంగా చూపే ప్రయత్నం చేసినా చివరిలో తన అక్క అక్షర అని చెప్పినా క్లైమాక్స్‌కు వచ్చేసరికి చెల్లె అంటూ కన్‌ఫ్యూజ్ చేశారు. ఇక స్పిరిట్ గేమ్‌తో హారర్ సినిమా బిల్డప్ ఇచ్చినా, ఆకట్టుకోని కథనంతో బోర్ కొట్టేసింది. దెయ్యం ఆవహించే సన్నివేశాలలో నటీనటులందరూ నవ్వుకుంటూ వుంటే వర్మ ‘బీ సీరియస్’ అనే వార్నింగ్ ఇస్తాడు. ఈ మాట ఈ సినిమాకు ఖచ్చితంగా సరిపోతుంది. నటీనటులు, దర్శకులు ఎక్కడా సీరియస్‌గా సినిమా కోసం కష్టపడిన దాఖలాలు కన్పడవు. మొదటిసారి దెయ్యం ఆవహించేముందు ఊర్మిళను నీకు తెలిసిన చనిపోయినవాళ్ళ పేర్లు చెప్పమంటాడు వర్మ. రెండోసారి ఆవహించేటప్పుడు ఏ పేరు చెప్పకుండా డైరెక్టుగా అక్షర ఎంటరైయిపోతుంది. ఇది స్క్రీన్‌ప్లే లోపమే. ముఖ్యంగా నటీనటులందరూ కొత్తవాళ్లైనా వాళ్ళల్లో నటించాలన్న ఉత్సాహం బాగా వున్నా, సరైన ముఖ కవళికలు చూపలేకపోయారు. కొద్దిసేపు దెయ్యం ఫ్లాష్‌బ్యాక్, మరికొద్దిసేపు ధన్‌రాజ్ ఫ్లాష్‌బ్యాక్ చిత్రీకరించినా చివరికి రెండు ఫ్లాష్‌బ్యాకుల్లో ఒకటే కథ కదా వుంది. ప్రేక్షకుల్ని ఇంతగా హింసించడం అవసరమా? పాత్రల హావభావాలతోపాటు బాడీ లాంగ్వేజ్ కూడా ఎబ్బెట్టుగా కన్పించింది. అయిదోతనం లేని ఆడదాన్ని సమాజం ఎలా చూస్తుందో డబ్బులేని మగవాణ్ణి ఈ సమాజం అలానే చూస్తుందంటూ మాటల రచయిత అక్కడక్కడా మెరుపులు మెరిపించాడు. సినిమాలో బాగా నచ్చే అంశం కెమెరా పనితనం. నటీనటుల్లో ఏ మాత్రం స్పార్క్ లేకున్నా, తన కెమెరాతో మెరుపులు మెరిపించాడు. ఉన్నంతలో ప్రతి దృశ్యం తెరపై చక్కగా ఆవిష్కరించాడు. ‘చూస్తున్నా చూస్తున్నా’ అన్న పాట ఒక్కటి బాగుంది. దర్శకత్వం పరంగా నాటకాలు చూసిన అనుభవం మాత్రమే కన్పించింది.

-సుజిత్