హైదరాబాద్

పాతబస్తీ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లాక్‌డే ర్యాలీ.. 20 మంది అరెస్ట్ స్వచ్ఛందంగా షాపుల మూసివేత

హైదరాబాద్, డిసెంబర్ 6: బ్లాక్‌డే సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో షాపుల యాజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను అధికారులు నడుపలేదు. దీంతో రోడ్లు బోసిపోయాయి. బాబ్రీ మసీదు విధ్వంసానికి నిరసనగా ఆదివారం బ్లాక్‌డేను నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కొన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఆప్రమత్తమైన నగర పోలీసులు వివిధ ప్రాంతాలతో పాటు పాతబస్తీలో నిఘాను ముమ్మరం చేశారు. నగరంతో పాటు పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పాతబస్తీలోని అన్ని పోలీస్టేషన్‌ల పరిధిలో కట్టు దిట్టమైన పోలీసు బందోబస్తును ఎర్పాటు చేశామని దక్షిణ మండలం డిసిపి వి.సత్యనారాయణ తెలిపారు. ఫలక్‌నుమా, చార్మినార్, చౌమహాల్ ప్యాలేస్‌ను తిలికించాడానికి దేశ, విధేశాల నుండి పర్యటకులు వస్తున్నారని, వారిని కూడా దృష్టిలో పెట్టుకుని పాతబస్తీలో పోలీసు బందోబస్తును ముమ్మరం చేశామని అన్నారు. చార్మినార్, డబీర్‌పుర, చంచల్‌గూడ, చాంద్రాయణగుట్ట, చార్మినార్, మదీనా, మీరాలంమండి, మీర్‌చోక్, సంతోష్‌నగర్, బాబానగర్, బర్కాస్ తదతర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ముమ్మరం చేశామని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల తరువాత పాతబస్తీలోని అన్ని ప్రాంతాల్లో దుకాణాలను తెరిచారని, ఎక్కడ కూడా చిన్న సంఘటన జరుగలేదని తెలిపారు. 1200 మంది పోలీసులతో బందోబస్తును ఎర్పాటు చేసి, ఆర్‌ఎఎఫ్, నగర ఆర్మ్‌డ్ ఫోర్సు బలగాలను పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో మోహరించామన్నారు. చార్మినార్ మక్కమసీదులో ప్రార్థనలు ప్రశాంతగా జరిగాయి. మందు జాగ్రత్త చర్యగా నగర పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేశారు. మీర్‌చోక్ పోలీస్టేషన్ పరిధిలోని దారుల్‌షిఫా ప్రాంతంలో డిజెఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా మసీదు బయటకు వచ్చి పెద్దయెత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించారు. అప్రమత్తమయిన దక్షిణ మండలం పోలీసులు.. 20 మంది డిజెఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని డబీర్‌పుర పోలీస్టేషన్‌కు తరలించారు. బ్లాక్‌డే సందర్భంగా శాంతి భద్రతలపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఎప్పటికపుడు అధికారులతో సమీక్షించారు.