బిజినెస్

సహకారానికి ఇదే అవకాశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల రుణ అవసరాలు తీరిస్తే మళ్లీ పూర్వవైభవం

రాజమండ్రి, డిసెంబర్ 24: గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అప్పుపుట్టని పుట్టని పరిస్థితులను వినియోగించుకోవటం ద్వారా మళ్లీ పూర్వవైభవాన్ని సాధించుకోవడానికి సహకార సంఘాలకు మంచి అవకాశం లభించింది. సుమారు 15ఏళ్ల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాలతో పాటు, అర్బన్ ప్రాంతాల్లో కూడా సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు, రైతులు తమ అవసరాల కోసం సహకార సంఘాలపైనే ఆధారపడేవారు. సహకార వ్యవస్థ బలహీనమవటం మొదలవటంతోనే ప్రజలు వడ్డీ వ్యాపారులపై ఆధారపడటం ప్రారంభమయింది. అలాంటి పరిస్థితే ఇపుడు కాల్‌మనీ వరకు దిగజారింది. ఇలాంటి పరిస్థితిని అర్బన్ ప్రాంతాల్లోని సహకార అర్బన్ బ్యాంకులు, గ్రామీణ ప్రాంతాల్లోని సహకార సంఘాలు అనుకూలంగా మార్చుకుంటే మళ్లీ సహకార ఉద్యమం పూర్వవైభవాన్ని చూస్తుందని ఆ రంగ నిపుణులు సూచిస్తున్నారు. 20ఏళ్ల క్రితం గ్రామీణ మార్కెట్‌లోని రుణాల వాటాలో 60 శాతం కలిగి ఉన్న సహకార సంఘాలు, ఇపుడు 15 శాతానికి దిగజారినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ వాటాను మళ్లీ 60 శాతానికి పెంచుకుంటే ప్రయివేటు వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్టవేయవచ్చని, ఈ దిశగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సహకార రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో సుమారు 2900 సహకార సంఘాలు ఉంటే, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి 2100 సహకార సంఘాలు వచ్చాయి. అంటే సహకార వ్యవస్థను చక్కదిద్దటం ద్వారా ప్రయివేటు వడ్డీ వ్యాపారుల బారి నుండి ప్రజలను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే ఎక్కువ బాధ్యత ఉందన్న మాట. రాష్ట్రంలో ఉన్న 2100పైచిలుకు సహకార సంఘాల్లో దాదాపు 80శాతం సంఘాలు నిధులు లేక, సొంతంగా ఎలాంటి కార్యకలాపాలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహకార సంఘాలకు ప్రత్యేకంగా నిధులు అందించి, సామాన్య, మధ్యతరగతి ప్రజల రుణ అవసరాలను తీర్చటం ద్వారా అధిక వడ్డీల రుణాల నుండి విముక్తులను చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి, వాటినే రుణాలుగా ఇస్తూ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేసులకు భయపడి వడ్డీ వ్యాపారులు రుణాలు ఇవ్వటంలేదు. దాంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అప్పు పుట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు దగ్గరై, రుణ అవసరాలు తీరిస్తే సహకార వ్యవస్థ మళ్లీ ప్రజలకు బాగా దగ్గరవుతుందని సహకార రంగ నిపుణులు చెబుతున్నారు.
గతంలో ఎరువులు, పురుగుమందులు అమ్మటం ద్వారా రైతులకు సేవలందించిన సహకార సంఘాలు, గత 15ఏళ్లుగా అలాంటి పరపతేతర కార్యక్రమాలకు స్వస్తిచెప్పాయి. దీనివల్ల రైతులు చాలా చోట్ల ఎరువులు వ్యాపారులపై ఆధారపడి, ఎంత ధరకు అమ్మితే, అంతకు కొనుగోలుచేసి, పంట చేతికొచ్చిన తరువాత తక్కువ ధరకు, అదే ఎరువుల వ్యాపారికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దారుణాల నుండి రైతులను కాపాడాలంటే, గ్రామీణ ప్రాంతాల్లో సహకార వ్యవస్థను బలోపేతం చేసుకోవటం ఒక్కటే మార్గమని, లేదంటే రాష్ట్రప్రభుత్వం, జనం మరచిపోయిన తరువాత మళ్లీ కాల్‌మనీ ఆగడాలు మామూలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.