బిజినెస్

సమాచార వ్యవస్థ పేరిట ఆర్టీసీ ‘వడ్డన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎసి, హైటెక్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూపాయ పెంపు
గుంటూరు, డిసెంబర్ 24: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తున్న దృష్ట్యా చార్జీ రూపాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ రాత్రికి రాత్రే ఆకస్మికంగా చార్జీలు పెంచి ప్రయాణికులపై గురువారం నుంచి భారం వేయటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణ, ఎక్స్‌ప్రెస్ బస్సులను మినహాయించి డీలక్స్, ఏసి, వెనె్నల, హైటెక్ బస్సుల్లో ప్రయాణించే వారిపై రూపాయి అదనంగా వసూలు చేస్తున్నట్లు గుంటూరు రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి గురువారం తెలిపారు. ఆర్టీసీలో దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేయిస్తారు. రిజర్వేషన్ చేసిన ప్రయాణికునికి వెంటనే టిక్కెట్ రిజర్వు అయినట్లు ఎస్‌ఎంఎస్ వస్తుంది. అంతేకాకుండా ప్రయాణికుడు బస్సు సకాలంలో ఎక్కని పరిస్థితుల్లో కండక్టరు, డ్రైవర్ ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. అందువల్ల ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటున్న ప్రయాణికుల వద్ద నుంచి అదనంగా రూపాయి వసూలు చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికులపై భారీగా చార్జీల మోత మోగించిన విషయం తెలిసిందే. దసరా పండుగకు ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో చార్జీలు ఆకస్మికంగా పెంచటంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పెంచిన చార్జీలను ఏ మాత్రం తగ్గించలేదు. పెంచిన చార్జీల నుంచి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను మినహాయించారు. అయినా మిగిలిన అన్ని ఎక్స్‌ప్రెస్‌లకు చార్జీలు పెంచటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.