కరీంనగర్

ఆన్‌లైన్‌లో కార్మికులకు వేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వౌలిక వసతులపై చర్యలు చేపట్టాలి
* బట్టీలోనే వైద్య సేవలందించాలి
* కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశం
* ఇటుక బట్టీలలో సౌకర్యాలపై కలెక్టర్ ఆగ్రహం
పెద్దపల్లి , మార్చి 15: ఇటుక బట్టీలలో పని చేస్తున్న వలస కార్మికుల సమస్యల పరిష్కారించడంతో పాటు వౌళిక సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. మండలంలోని హన్మంతునిపేట గ్రామ సమీపంలో గల ఇటుక బట్టీలను ఆమె మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇటుక బట్టీ కార్మికుల నివాస గృహాలను పరిశీలించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఇస్తున్న కూలీ డబ్బుల విషయమై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను సందర్శించారు. సరైన ఉపాధ్యాయులు, పుస్తకాలు లేకుండా మొక్కుబడిగా జరుగుతున్న విద్యా బోధన, మధ్యాహ్న భోజన నిర్వాహణ లేక పోవడం పట్ల ఆమె అధికారులపై మండి పడ్డారు. కార్మికలు పిల్లలకు వెంటనే కావాల్సి పుస్తకాలు, పలకలు, పెన్నులు ఇవ్వాలని కలెక్టర్ కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. , ఇటీవలి కాలంలో ఇటుక బట్టీలలో జరిగిన పలు సంఘటనలు జరిగిన తర్వాత ప్రత్యేక ఆదేశాలు జారి చేసినా, అధికారుల సరైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మీడియాతతో మాట్లాడుతూ కార్మికుల శ్రమకు తగిన వేతనాలు (కూలీ డబ్బులు) ఆన్‌లైన్ ద్వారా వారం వారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని, మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, అంగన్‌వాడీ ద్వారా పిల్లలు, గర్భిణి, బాలింత స్ర్తిలకు పౌష్టికాహారం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పదిహేను రోజులకు ఒకసారి వైద్య శిబిరం ఏర్పాటు చేసి, వైద్య సేవలందించాలని సూచించారు. కార్మికుల పట్ల ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్డీవో సి.నారాయణరెడ్డి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, తహశీల్దార్ అనుపమరావు, ఎంఇవో హన్మంతు ఉన్నారు.