అంతర్జాతీయం

అంగారకుడిపైకి మరో ఆర్బిటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా, ఐరోపా ఉమ్మడి ప్రయోగం
అక్టోబర్‌లో అరుణ గ్రహానికి చేరనున్న టిజీవో
బైకనూరు, మార్చి 14: అంగారక గ్రహంపై జీవజాలం ఆనవాళ్లు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు మరో బృహత్తర ప్రయత్నం మొదలైంది. ఇప్పటికే అమెరికాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహం ఉపరితలాన్ని అనేక కోణాల్లో శోధిస్తోంది. పలుమార్లు ఈ గ్రహ తొలిదశలో నీటి ఆనవాళ్లు ఉన్నాయన్న సంకేతాలను అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా, ఐరోపాలు అరుణగ్రహంపై జీవజాతుల జాడకోసం ఉమ్మడి ప్రయత్నం చేపట్టాయి. ఇందులో భాగంగా సోమవారం విజయవంతంగా ఒక ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ (టిజివో)ను ప్రయోగించాయి. అనేక అత్యున్నత స్థాయి సాంకేతిక పరికరాలు కలిగిన ఈ ఆర్బిటర్ 496 మిలియన్ కిలోమీటర్ల మేర పయనించి ఏడు నెలల తర్వాత అంటే అక్టోబర్‌లో అంగారక గ్రహాన్ని చేరుకుంటుంది. రష్యాలోని కజకిస్తాన్‌లోగల బైకనూరు కాస్మోడ్రోమ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా విజయవంతంగానే దీన్ని పూర్తిచేశామని రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్ కాస్మోస్ తెలిపింది. మొత్తం రెండు దశలుగా ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ, రష్యా రోదసీ సంస్థ ఈ అధ్యయనాన్ని చేపడతాయి.
తొలిదశ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో రెండో ప్రయోగాన్ని కూడా త్వరలోనే చేపడతామని ఈ రెండు సంస్థలూ తెలిపాయి. ఎక్సోమార్స్ పేరిట ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టామని వెల్లడించాయి. ఇంకా అంగారక గ్రహం ‘సజీవంగా ఉందా లేదా’ అన్నదే తమ ప్రయోగ లక్ష్యమని తెలిపాయి.