Others

శ్రీకృష్ణ లీలామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమన్నారాయణుని అవతారాలలో శ్రీకృష్ణావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణుడు లీలా మానుష రూపధరుడై తాను భగవానుడినని చాటి ఒప్పించి పూజలందుకున్న ఇతిహాస నాయకుడు. కొడుకుగా, ప్రజా నాయకునిగా, ఆపన్న రక్షకుడిగా, ఒక మంచి స్నేహితునిగా.. ప్రేమపాత్రుడుగా, గోపికలకు మనోరంజకునిగా రాధకు హృదయే శ్వరునిగా, గోవులకు గోపాలునిగా శ్రీకృష్ణునిగా పుట్టిన మహావిష్ణువు కృష్ణావతారంలో చేయని కృత్యం లేదు. అలరించని ప్రాణి లేదు. అందుకే ద్వాపరయుగంలోనేకాదు కలియుగంలోనూ కృష్ణ కృష్ణ అనని వారు ఎవరూ ఉండరు.
తల్లిదండ్రుల తరువాత.. గురువును మించిన దైవము లేడని భావించి గురుదక్షిణ విషయంలో అమానుష దివ్యలీలనుప్రదర్శించాడు. సాందీపునికి శుశ్రూష చేశాడు. గురుదక్షిణ ఇచ్చి ఋణం తీర్చుకోవాలి. తన గురుదక్షిణ గురువుకు ప్రీతిపాత్రమై తనను భగవంతుడిగా ఆరాధించి భావించేవారికి భక్త్భివాన్ని, శక్తిమంతుడైన శిష్యునిగా ఘనమైన గురుదక్షిణ ఇవ్వాలనుకునే ఇతర శిష్యులకు ఆచరణీయము కావాలన్న లోక ధర్మానికి కట్టుబడ్డాడు. ‘జాతస్య మరణం ధ్రువమ్’ అని ప్రవచించిన అవతారమూర్తి గురుపుత్రుని బ్రతికించి తీసుకువచ్చి గురుదక్షిణను తీర్చానని అన్న కృష్ణుడే నేడు జగద్గురువు. ఆయన బోధించిన సామాజిక, సాంస్కృతి, రాజకీయ జ్ఞానం ఇది ఇంతటిది అని చెప్పడానికి వీలు అవుతుందా? కృష్ణుడు బోధించిన గీతనే నాడు అర్జునునికి ప్రాణా పాయవస్థను తప్పించి కర్తవ్య ముఖుని చేసి అధర్మంపై ధర్మవిజయునిగా నిలబెట్టింది. ఈనాడు ఆ గీతనే వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తిగా కనిపించడానికి మానవత్వ విలువను మనిషిలో ప్రోగు చేయడానికి మనిషిగా మనిషిగా బతకడానికి మేలొనరిస్తోంది. తన కుక్షిలో 14 భువనాలు పెట్టుకున్న శ్రీకృష్ణుడు యశోదమ్మకు చిట్టి కొడుకుగా గారాలు పోయేవాడు. తన కన్నకొడుకు తన మాట వినడంలేదని వెన్న మీగడలు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన చిన్ని తనయుడు మన్నుతింటున్నాడని వాపోయిన యశోదమ్మ చిన్మయుడిని చిన్నవాడని పట్టుకొంది. పద్నాల్గు లోకాలను గడగడలాడించే పరమాత్మను గదామాయించింది. మన్ను తింటున్నావని నీ సంగడీలు చెబుతున్నారు నీ నోటిని చూపమని గద్దించింది.
పాపమా బాలకృష్ణుడు అమ్మకు భయపడినట్లుగా నోరు తెరిచాడు. యశోదమ్మకు తన నోటిలోనే 14 భువనాలు కనిపింపచేశాడు. మ్రాన్పడి చూస్తున్న తనే్న నమ్ముకున్న యశోదమ్మకు మాయను కప్పి ‘‘అమ్మా నేను మన్ను తినలేదమ్మా వారే కల్లలాడుతున్నారమ్మా’’ అంటూ కనుల నీరు కార్చాడు.
ముద్దు మాటలు మాట్లాడే తన చిన్ని వాణ్ణి అనవసరంగా అనుమానించానని ఎత్తుకుని ముద్దాడింది ఆ అమాయకురాలైన యశోదమ్మ. ఆ కృష్ణుడే అర్జునునికి సారథిగా మాత్రమే ఉంటానని తాను ఏ పరిస్థితులోను ఆయుధం పట్టనని చెప్పి కురుక్షేత్రానికి వచ్చాడు. భీష్ముడు చెలరేగి పార్థుని పని పడుతుంటే తాను తన భక్తుని కష్టాలను చూడలేక కోపమావేశించి రథమునుంచి కుప్పించి ఎగిసి దిగి రథ చక్రాన్ని తీసి భీష్మునిపైకి వెళ్లాడు. ‘‘ఆహా! కృష్ణా ! నీ భక్తపరాధీనత ఎంతటిది. నీవు నీ ప్రతిననే పక్కకు పెట్టి ఆర్తజనబాంధవుడివై నీ భక్తుని రక్షణ చేయడం నీ చేతిలో నేను ప్రాణాలు కోల్పోవడం నాకు ఎంతటి భాగ్యమో కదా!’’ అని చేతులు జోడించి వేడుతున్న భీష్ముని చూస్తూ తన్ను రక్షించమని తనను అభాసు పాలు చేయవద్దని బతిమిలాడే అర్జునుని చూచి ఎత్తిన రథచక్రాన్ని దింపిన కృష్ణుని చూచిన ప్రజ ఏమని పొగడుతుంది. ఎంతని కృష్ణుని కీర్తిస్తుంది.
ఈ రక్షణ శ్రీకృష్ణునికి ప్రౌఢవయస్సులోనో రణక్షేత్రంలోనో వచ్చిందా ఏమిటి కాదు కాదు తన్ను నమ్ముకున్న వారిని తాను పాలుకుడిచే సమయం నుంచి కాపాడు తున్నాడు. తనను వెదికే నెపంతో కంసుడు బాలలను హతమార్చేవానిగా మారి పూతనలను పంపితే ఆ పూతన పాలు త్రావే నెపంతోనే ప్రాణాలను లాగి వేసాడు.
తన్ను పూజించడం లేదని వడగండ్లు కురిపించే ఇంద్రుడే దేవుడు కాడు మనలను రక్షించే ప్రకృతే పరమాత్మను అని గోవర్థనగిరికి పూజలు చేయంచి ఆ గోవర్థన గిరి నెత్తి ఆబాలగోపాలాన్ని రక్షించి అటు ఇంద్రునికి బుద్ధిని గరిపాడు ఇటు ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాడు. అట్లా ప్రజా సంరక్షకుడిగా ఎదిగి రాక్షసులందరినీ హతమారుస్తూ కంసుణ్ణి కూడా సంహరించి యావజ్జనులను కాపాడినవాడు శ్రీకృష్ణుడే కదా. తనకు తెలియని ఏమీ లేవని ఎవరి కర్మల తాలూకూ ఫలితాలను వారు అనుభవించాల్సిందేనని ఒకవేళ విశ్వాసంతో నమ్మకంతో తన్ను కొలిచే వారికి వారు అడగకున్నా అన్నీ తానై ఉంటానని చెప్పడానికా అన్నట్టు కుచేలునితో స్నేహం చేశాడు. గురుకులంలో తన సహఅధ్యాయ. తన చెలికాడు గర్భదారిద్య్రంతో కుమిలిపోతున్నాడని తెలిసినా తెలియనట్టే ఉన్నాడు. చివరకు ఓ నాడు కుచేలుని భార్య దారిద్య్ర బాధల లనుభవించలేక తన భర్త చేతికి అటుకులిచ్చి తమను కాపాడమని చెప్పి రమ్మంది. తనకు ఏమీ తె లీనట్టుగానేతన చిన్ననాటి స్నేహితుడు వచ్చీరాగానే ఎదురెళ్లి ఆహ్వానించాడు. తన సతితో కలసి ఆర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించాడు. తన పక్కనే కూర్చో బెట్టుకుని యోగక్షేమాలు అడిగాడు. తనే అడిగి అంగవస్త్రంలో కట్టుకున్న అటుకులను తనకెంతో ఇష్టమని ఆరగించాడు. వెళ్లివస్తానన్న కుచేలుని జాగ్రత్తగా వెళ్లిరమ్మని చెప్పాడు. కాని కుచేలుడే ఆశ్చర్యపోయేట్టు సంపదలను గ్రహించాడు. ఇదంతా శ్రీకృష్ణుని లీలా మానుషచర్యలే కదా.
తెలిసిన స్మరించినా, తెలియక స్మరించినా తన్ను నమ్ముకున్నవారిని ఆదుకునే పరమాత్మనే శ్రీకృష్ణుడు. మానవ ధర్మ మహోత్కృష్టత ఎంతటిదోప్రతి అంశంలోను చేసి చూపించాడు. శ్రీకృష్ణుని అడుగు జాడల్లో నడిచినవానికి ఇక ఈలోకంలో ఎదురేముంటుంది? సర్వేజనా సుఖినోభవన్తు అనే తత్వం ఆకళింపు అయతే ఇక వారికి కృష్ణుల వారికి తేడా ఏముంటుంది?

-హనుమాయమ్మ