AADIVAVRAM - Others

డబ్బు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులను చూసి చాలా మంది అలెగ్జాండర్‌ని ఉదహరిస్తూ ఉంటారు. ఆయన శవపేటికలో బయటకు ఆయన చేతులు కన్పిస్తూ ఉంటాయని, తాను ఏమీ తీసుకొని వెళ్లడం లేదనడానికి ఉదాహరణగా ఆ కథని చాలామంది చెబుతూ ఉంటారు. అది పూర్తిగా వాస్తవం కాదు.
మనిషి జీవితంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. డబ్బు సంపాదన ఎంత ముఖ్యమో దాని కోసమే జీవితాన్ని అంకితం చేయకపోవడం అంతకన్నా ముఖ్యం.
మనం చనిపోయినప్పుడు డబ్బు మన వెంట రాదు. దాని కోసం వెంపర్లాడటం అనవసరమని చాలామంది అంటూ ఉంటారు. డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని అనడం ఎంత అసత్యమో డబ్బు లేకపోతే ఆనందం ఉంటుందని అనడం పూర్తిగా అబద్ధం.
సంతోషంగా ఉండటానికి డబ్బు అవసరం లేదు. కాని డబ్బు ఉంటే సంతోషం పొందవచ్చు. ఇతరుల కళ్లల్లో సంతోషాన్ని చూడవచ్చు. ఇతరుల సంతోషానికి మనం కారణం కావొచ్చు. సంతోషం పొందడానికి డబ్బు కూడా ఒక సాధనం. ఎన్నో ఉదాహరణలని చూపించవచ్చు.
డబ్బుతో పిల్లలకి బొమ్మలు కొనిచ్చి వాళ్ల కళ్లల్లో ఆనందం చూసి మనం ఆనందించవచ్చు. అది మన కోసం ఉపయోగించుకున్న దానికన్నా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది.
అనాథ పిల్లలకి డబ్బు ఇచ్చి వాళ్లు అభివృద్ధి చెందడానికి కారణం కావొచ్చు. వాళ్లు లబ్ధి పొంది ప్రయోజకులైతే వాళ్లకు డబ్బు ఇచ్చిన వ్యక్తికన్నా ఆనందపడే వ్యక్తి మరెవరు ఉంటారు..?
డబ్బు ఉంటే ప్రయాణాలు చేయవచ్చు. కొత్త వ్యక్తులని కలువవచ్చు. కొత్త అనుభవాలని, అనుభూతులని పొందవచ్చు. గొప్ప జ్ఞాపకాలు మిగులుతాయి. జ్ఞాపకాల్లో ఎంతో ఆనందం ఉంటుంది.
కళాకారులకి, కవులకి, రచయితలకి సహాయం చేయవచ్చు. అందమైన పేయింటింగులని కొని చిత్రకారులని ప్రోత్సహించవచ్చు. అవార్డులని నెలకొల్పి కళాకారులని, రచయితలని ప్రోత్సహించి ఆనందం పొందవచ్చు.
కళాకారులనే కాదు, క్రీడాకారులని కూడా ప్రోత్సహించి వాళ్ల కళ్లల్లో ఆనందాన్ని చూసి ఆనందం పొందవచ్చు.
డబ్బే జీవితం కాదు.
కానీ-
జీవితంలో ఎంత ముఖ్యమైంది డబ్బు.
డబ్బుతో సంతోషం రాదు.
కానీ-
డబ్బుతో సంతోషం పొందవచ్చు.
డబ్బుతో ఎన్నో చేయవచ్చు.
డబ్బుతో ఆనందం పొందాలంటే
ఇతరుల్లో ఆనందం నింపాలి.
అప్పుడే ఆనందం పొందగలం.