Others

భలే రాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1934లో నిర్మించిన తొలి తెలుగు స్టూడియో -వేల్ పిక్చర్స్. విఎల్ నరసు దాన్నికొని, నరసూ స్టూడియోస్‌గా మార్చి ఆ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం -్భలే రాముడు. 1943లో బాంబే టాకీస్ పతాకంపై, అశోక్‌కుమార్, ముంతాజ్ శాంతి కాంబినేషన్‌లో గ్యాన్ ముఖర్జీ కథ, దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం -కిస్మత్. ఈ చిత్రం కలకత్తాలో ఒకే థియేటర్‌లో మూడేళ్లు ప్రదర్శింపబడింది. ఈ చిత్రకథ ఆధారంగా నరసూ సూడియో ఏఎన్నార్, సావిత్రి జంటగా తెలుగులో ‘్భలే రాముడు’గా, జెమినీ గణేశన్, సావిత్రి జంటగా తమిళంలో ‘ప్రేమపాశం’గా నిర్మించారు. 1956 ఏప్రిల్ 6న చి1934లో నిర్మించిన తొలి తెలుగు స్టూడియో -వేల్ పిక్చర్స్. విఎల్ నరసు దాన్నికొని, నరసూ స్టూడియోస్‌గా మార్చి ఆ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం -్భలే రాముడు. 1943లో బాంబే టాకీస్ పతాకంపై, అశోక్‌కుమార్, ముంతాజ్ శాంతి కాంబినేషన్‌లో గ్యాన్ ముఖర్జీ కథ, దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం -కిస్మత్. ఈ చిత్రం కలకత్తాలో ఒకే థియేటర్‌లో మూడేళ్లు ప్రదర్శింపబడింది. ఈ చిత్రకథ ఆధారంగా నరసూ సూడియో ఏఎన్నార్, సావిత్రి జంటగా తెలుగులో ‘్భలే రాముడు’గా, జెమినీ గణేశన్, సావిత్రి జంటగా తమిళంలో ‘ప్రేమపాశం’గా నిర్మించారు. 1956 ఏప్రిల్ 6న చిత్రం విడుదలై 60యేళ్లు పూర్తి చేసుకుంది.త్రం విడుదలై 60యేళ్లు పూర్తి చేసుకుంది.

---
కథ, రచన: సదాశివబ్రహ్మం
కెమెరా: ఎం మస్తాన్
కళ: ప్రసాద్
ఎడిటింగ్: రాజ్‌గోపాల్
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
దర్శకత్వం:
వేదాంతం రాఘవయ్య
---

జమీందారు నారాయణరావు (గౌరీనాథ శాస్ర్తీ)కి ఇద్దరు కుమార్తెలు -రూపమాల, తార. వారిద్దరికీ నృత్యం నేర్పించి ప్రదర్శనలకు థియేటర్ కట్టిస్తాడు. జమీందారు వద్ద గుమస్తా నాగభూషణం (సిఎస్‌ఆర్). అతనికి ఇద్దరు కుమారులు రామకృష్ణ, గోపీనాథ్.
రాముకు రూప అంటే అభిమానం. ఆమె పుట్టినరోజుకు తామర పువ్వులు తెచ్చి ఇస్తుంటే, జమిందారు విదిలిస్తాడు. దాంతో పొరపాటున రూపను మేడ మెట్లమీంచి నెట్టివేస్తాడు. రూప అవిటిదౌతుంది.
ఆ కోపంతో జమీందారు రామును తుపాకీతో కాలుస్తాడు. రాము నదిలోపడిపోతాడు. పోలీసుల భయంతో ఆస్తిని, పిల్లలను నాగభూషణానికి అప్పగించి జమీందారు నారాయణరావు పరారౌతాడు. ఆస్తి వచ్చిన తరువాత నాగభూషణం -రూప (సావిత్రి), తార (గిరిజ)లను ఆదరించడు. రూప చేత థియేటర్‌లో నృత్యం చేయించి జీతం ఇస్తుంటాడు. రాము పెద్దవాడై దొంగగామారి శిక్ష అనుభవించి కలకత్తానుండి మద్రాస్‌కు వస్తాడు. ఒకరోజు రూప నృత్యం ముగిసాక, నాగభూషణం భార్య హేమలత మెడలో హారం తస్కరిస్తాడు. దాన్ని రూప పియోనోలో దాస్తాడు. దానికోసం వారింటికి వెళ్ళిన కృష్ణ (అక్కినేని) రూప ఎవరో గ్రహించి, ఆమెకు తారకు సాయంగా వారింటిలో అద్దెకు ఉంటాడు. రూప చిన్నప్పటి నెక్లెస్ ఆమెకివ్వటం, దాన్ని ధరించి థియేటర్‌కు వెళ్ళిన రూపను పోలీసులు అరెస్ట్ చేయబోగా కృష్ణ తానే దొంగిలించానని ఒప్పుకుంటాడు. కృష్ణ దొంగని తెలిసి రూప కుమిలిపోతుంది. పోలీసుల నుంచి తప్పించుకున్న కృష్ణ, అప్పన్న (రేలంగి) సాయంతో నాగభూషణం ఇంట్లోంచి డబ్బు దొంగిలించి, రూపకు డాక్టరుచే కాలు నయం చేయిస్తాడు. రూప చెల్లెలు తార, నాగభూషణం చిన్నకొడుకు గోపి (చలం) ప్రేమించుకుంటారు. గర్భవతియైన తారను తన కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలంటే 10వేలు కట్నం కావాలని రూపకు చెబుతాడు నాగభూషణం. ఆత్మహత్యకు సిద్ధపడిన తారను కృష్ణకాపాడి, ఆమెకు, గోపికి ఒక గుడిలో పెళ్ళి చేయటానికి సిద్ధపడతాడు. కృష్ణను పట్టుకోవాలంటే రూప చేత నృత్యం ఏర్పాటు చేయాలన్న ఇన్‌స్పెక్టర్ (గుమ్మడి) సూచనపై నాగభూషణం ఆమెను ఒప్పించి ప్రదర్శన ఇప్పిస్తాడు. రూప నృత్య ప్రదర్శనకు అరేబియన్ డ్రెస్‌లో వచ్చిన కృష్ణను పోలీసులు తిరిగి అరెస్ట్ చేయబోగా, తప్పించుకుని వెళ్ళిన కృష్ణ దేవాలయంలో తార, గోపీల వివాహం జరిపిస్తారు. అక్కడకు వచ్చిన పోలీసులు, నాగభూషణం, కృష్ణ చేతిమీదగల పచ్చబొట్టు ‘రామూ’ ద్వారా తమ కుమారుడని తెలుసుకుని ఆనందించి, రూప, రామకృష్ణల చేతులు కలపటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
‘కిస్మత్’ చిత్రంలోని కొన్ని అంశాలను (తండ్రి ఆపకుండా మద్దెల వాయించటంవల్ల రూప అవిటిదవటం), (పచ్చబొట్టు పొడిపించుకున్న రాము, సవితి తల్లిపట్ల కోపంతో ఇల్లువదలటం) తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చుకున్నారు. రామూ పొరపాటు వల్ల మేడమించి పడడం, పచ్చబొట్టువేసే యువతి నృత్యం, నైపుణ్యం చూసి ముచ్చటపడి రాము పచ్చబొట్టు పొడిపించుకోవటంలా మార్చుటం.. ఇంకా సందర్భోచిత సంభాషణలతో ఆకట్టుకునే గీతాలతో అలరించేలా రచన సాగించారు రచయిత సదాశివబ్రహ్మం.
దర్శకుడు వేదాంతం రాఘవయ్య అనుభవంతో కూడిన అభిరుచితో చిత్రంలోని సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. చక్కని నృత్యాలు, హాస్యాన్ని, సీరియస్‌నెస్‌ని కలగలిపిన సన్నివేశాలు చిత్రంలో పొందుపర్చారు. అప్పన్న రేలంగి, పనిమనిషి బంగారి సీతల హాస్య సన్నివేశాలు, ఇన్‌స్పెక్టర్ గుమ్మడి మారువేషంలో కృష్ణను కలవటం.. -ఇక్కడున్నవాళ్ళు చాలక కలకత్తానుంచి దిగబడ్డారన్న మాట అంటూ సందర్భోచిత సంభాషణ, ఏఎన్నార్‌తో రూపను థియేటర్‌లో నృత్యం చేయమని సిఎస్‌ఆర్ కోరే సన్నివేశంలో ఆమె వ్రాసిన కాగితం చదివి సంతకం పెట్టడం, చిత్రం చివరిలో అది కృష్ణపైన కేసు విత్‌డ్రా చేసుకోవటంగా ప్రేక్షకులకు తెలియటం లాంటి సన్నివేశాలు అద్భుతంగా పండాయి. సిఎస్‌ఆర్, గుమాస్తాగా పేకేటి, రూపను ఇంటి అద్దెకోసం, పియోనాకోసం వేధించటం, ఇక రూప, కృష్ణల మధ్య అనురాగాన్ని వారిరువురి మధ్యా చూపులతో, సన్నిహితత్వంతో తెలపటంలాంటి దృశ్యాలను దర్శకులు వేదాంతం లాఘవంతో తీర్చిదిద్దారనిపిస్తుంది.
పోలీసులు పట్టుకుంటారని గౌరీనాథశాస్ర్తీ భయపడి సియస్‌ఆర్‌కు ఆస్తి అప్పగించాక ‘రక్షించాలి.. నా కొడుకును భక్షించిన వారిని నేను రక్షించాలి’ అని రియాక్షన్ ఇవ్వడం, డబ్బుపోగులపై అతని బిల్డింగ్‌లాంటివి అద్భుతంగా తోస్తాయి.
చిన్నతనంలో రాముగా దూకుడు, ఎదిగిన తరువాత కృష్ణగానూ అక్కినేని ఓ నిండుదనం, తెలివి చాకచక్యం నటనలో ప్రదర్శించారు. రూపను అభిమానించి, ఆమెతో ప్రణయం, ఆమెను చూడాలని, ఆమె నృత్యం చూడాలని అభిలాషతో హాస్పిటల్‌లో, థియేటర్‌లో చూపే సాహసం, దొంగగా మారినందుకు పశ్చాత్తాపం, మంచితనం ఇలా పలు వైవిధ్య భావాలను ఎంతో ఈజ్‌తో పలికించి మెప్పించారు. రూపగా సావిత్రి కాలు అవిటిదవటం, పేద స్థితి, చెల్లెలును పెద్దచేయటం, తండ్రి దూరమవటం, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న యువతిగా, ప్రేమించిన ప్రియుడు దొంగని తెలిసి బాధ, అతని ప్రేమపై నమ్మకం, అతని ప్రేమలో పరవశించిన ప్రణయినిగా ఎంతో సమర్ధవంతంగా పాత్ర పోషించి అలరించారు. మార్వాడీ షాపు యజమానిగా గాదిరాజు కేశవరావు, రూప, తారల తోడు బాబాగా రాఘవన్, సియస్‌ఆర్ భార్యగా హేమలత, బాల ఇతర పాత్రలు పోషించారు.
చిత్ర గీతాలు: చిత్రం ప్రారంభంలో రూప, తారల చిన్నతనాన్ని చూపిస్తూ ఓ నృత్యగీతం ఉంటుంది. చక్కని సెట్టింగ్‌ల మధ్య సాగే ఆ గీతం -ఎందున్నావో మాధవానందకుమారా కేశవా బృందావని కిటురావా (జిక్కి, ఏపి కోమల బృందం). పచ్చబొట్టు పొడిచే యువతిగా ఇవి సరోజ నృత్యంతో సాగే గీతం -నాణెమైన పచ్చబొట్టు పొడిపించుకోవా ఓ బేడ డబ్బులిస్తే చాలు బేరమాడతావా (జిక్కి). రూప, తార, బాబాలపై చిన్నపిల్లలు పెద్దవడాన్ని చూపిస్తూ శ్రీకృష్ణుని విగ్రహం ముందు పాడే గీతం -గోపాల దేవా కాపాడరావా ఏ పాప మెరుగని పసిపాప (పిబి శ్రీనివాస్, పి లీల బృందం). రూపగా సావిత్రి అవిటితనంతో చేసే నృత్యగీతం.. చంకలో కర్రతో వెనుక భారతదేశ పటం కనిపించేలా సాగే బృందగీతం -్భరతవీరా, భారతవీరా లేరా, భారతదేశము నీదేరా (పి లీల బృందం). దీనికి -‘హిందూస్తాన్ హమారా హై గీతం స్ఫూర్తి. గిరిజను నిద్రపుచ్చుతూ సావిత్రిపాడే గీతం, హాలులో అక్కినేని, ఆకాసంలో చంద్రుడు, మేఘాలను చూపుతూ ఆహ్లాదకరంగా సాగే గీతం -ఓహో మేఘమాల/ నీలాల మేఘమాల/ చల్లగ రావేలా/ తీయ తీయని కలలు కంటూ (పి. లీల). చెల్లెలిని మురిపెంగా చూస్తున్నట్టు చిత్రీకరించారు. దీనికి -్ధరే ధీరే బాదల్ ఆరే స్ఫూర్తి. చిత్రంలో ఇంకోసారి.. నిద్రపోతున్న సావిత్రి మెడలో హారం అలంకరించిన అక్కినేని ఆలపించే గీతంగా ఇది వినిపిస్తుంది. చివర సావిత్రి గొంతు కలపటం పాటలో ఈల, అద్దంలో చూస్తూ అక్కినేని రియాక్షన్, ఆకాసంలో జాబిలి, మేఘాలు, పూలు ఆహ్లాదకరంగా సాగే మధుర గీతం -ఓహో మేఘమాలా/ నీలాల మేఘమాల (ఘంటసాల, లీల). శ్రీకృష్ణుని విగ్రహంముందు సావిత్రి పాడే గీతం -మురళీధరా హరే మోహనకృష్ణా/ మొరవినరా దేవా కరుణింపరావా (పి లీల). సిఎస్‌ఆర్ ఇంట్లో రేలంగి, సీతలపై చిత్రీకరించిన హాస్య గీతం -బంగరు బొమ్మా భలేజోరుగా పదవే పోదాం (పిబి శ్రీనివాస్, జిక్కి). కృష్ణ దొంగ అని పోలీసులు అరెస్ట్‌చేశాక బాధతో రూప, చెల్లెలు, బాబాతో కలిసి ఇంట్లో పాడే పాట -కల మాయమయ్యేనా తలవ్రాత ఇదేనా (పి లీల). చెల్లెలు గర్భవతియని తెలిసి, రూప బాధతో శ్రీకృష్ణుని విగ్రహంముందు ఉండగానే పద్యంలో విన్పించే గీతం -్భయమేలా ఓ మనసా భగవంతుని లీల ఇదంతా పరమాత్ముని లీల (పిబి శ్రీనివాస్). నల్లని బురఖాతో, ఊరంతా దీపావళి సంబరాలు చూస్తూ విచారంగా రూప పాడే గీతం ఈ చిత్రంలో చివరిది. పాట చివర అక్కినేని కనిపించగానే వరుసమారి, ఆనందంతో బురఖా తొలిగించి నృత్యం చేయటం విశేషం. -ఇంటింటను దీపావళి మా ఇంటికి లేదా ఆ భాగ్యము రాదా. ఎస్ రాజేశ్వరరావు స్వరాలతో, సాహిత్యపరంగాను చిత్ర గీతాలు అలరించేలా రూపొందటం, ‘ఓహో మేఘమాల’ చిరస్మరణీయమైన, శ్రవణానంద గీతంగా నిలవటం ‘్భలే రాముడు’ ప్రత్యేక విశేషం. కొన్ని గీతాలు హిందీ ట్యూన్స్ అనుసరించినా, రాజేశ్వరరావుగారి సృజనాత్మక స్పష్టంగా కన్పిస్తుంది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి