Others

రైతన్నకు భరోసా ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పంట చేతికొచ్చే వరకూ దైవాధీనం... ఆ తరువాత దళారీ దయాచిత్తం’... ఇదీ మన దేశంలో దీనావస్థకు చేరిన వ్యవసాయం ముఖచిత్రం. అన్నదాతల ఆత్మహత్యలను మానవ హక్కుల సంక్షోభంగా భావిస్తూ, వాటిని అరికట్టే విధానమేమిటని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అడగడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం సరైన పని చేసింది. ఇలా నిలదీయడం ద్వారా సుప్రీం కోర్టు వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల చిన్నచూపుని ఎత్తి చూపింది. రైతు దుస్థితి, దేశ పురోగతికి మూలాధారమైన వ్యవసాయ రంగం అధోగతి పాలకులకు తెలియనిది కాదు. ఏటికాయేడు మరింత ఊబిలోకి దిగజారుతున్న ఈ ప్రధాన ఉపాధి రంగాన్ని విస్మరిస్తూ, అభివృద్ధి మంత్రాన్ని పాలకులు జపించడంలో అర్థం లేదు. తన ప్రాధమ్యాల్ని పునర్నిర్వహించుకోవాల్సిన ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయనందునే దేశంలోని అనేక ప్రాం తాల్లో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.
జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సిఆర్‌బి) తాజా నివేదిక ప్రకారం, గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 12,606 మంది అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పంటనష్టం, రుణబాధలు ప్రధానంగా రైతుల ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయి. గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 42శాతం ఎక్కువ. వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటున్నామని ప్రభుత్వాలు గంభీర ప్రకటనలు చేస్తున్నా- అప్పుల ఊబిలో అన్నదాతలు కూరుకుపోతున్నారన్నది సు స్పష్టం. అధికారిక గణాంకాలే ఇలా ఉంటే, అసలు గణాంకాలు మరింత భ యంకరంగానే ఉంటా యి. బలవన్మరణాలే ఈ స్థాయిలో ఉంటే బతుకు ఛిద్రమై, జీవన్మృతులుగా మిగిలినవారు అంతకు పదిరెట్లు ఉంటారు. మొత్తంగా మూడొంతుల దేశ జనాభాకి జీవనాధారంగా ఉంటున్న వ్యవసాయ రంగం ఎలా కుదేలైందో ఈ అంకెలే చెబుతాయి. అందుకు కారణాలు అంతుబట్టనివి కావు. ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రభుత్వ విధాన వైఫల్యాలే అందుకు ముఖ్య కారణం.
విత్తనాలు జల్లిన దశ నుండీ పంట చేతికొచ్చే దశ వరకూ సాధారణ రైతుకు సవాలక్ష సమస్యలు. అదనుకి అందని అప్పులు, విత్తనాలు, ఎరువుల సంగతి పక్కన పెడితే, చేతికొచ్చిన పంటని సరైన ధరకి అమ్ముకొనే అవకాశాలు స్వల్పం. వ్యవసాయోత్పత్తులకు డిమాండ్ ఎలా ఉన్నా మార్కెట్, మధ్యవర్తులు నిర్ణయించిన ధరకే రైతులు మరో గత్యంతరం లేక అమ్ముకోవాలి. కాదని పంటను ఉంచుకోవాల్సి వచ్చినా నిల్వ చేసుకొనే గోదాములు ఉండవు. కనీస మద్దతు ధరకి పూచీ పడే వ్యవస్థ లేదు. వెరశి రైతు బతుకు పంట చేతికొచ్చేవరకూ దైవాధీనం. ఆ తరువాత దళారీ దయాచిత్తంగా తయారైంది. ఈలోగా తనకో, తన కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఉన్న భూమిని అమ్ముకోవాల్సిందే. అయితే, వ్యవసాయదారుల సమస్యలను ఏ తీరున పరిష్కరించాలో ప్రభుత్వానికి తెలియక కాదు. స్వామినాథన్ కమిషన్, జయతీ ఘోష్ నివేదిక, మరిన్ని సాధికారిక నివేదికలు ప్రభుత్వాలకు అందుబాటులోనే ఉన్నాయి. చేయవలసిందల్లా చిత్తశుద్ధితో కూడిన జాతీయ రైతు విధానం. అందుకు కేంద్ర బడ్జెట్‌తోనే నాంది పలకాలి.

- డా. డి.వి.జి.శంకరరావు