Others

లడ్డూలతోపాటు జి.కే.బుక్స్ కూడా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయపూర్ (రాజస్థాన్)కి 120 కి.మీ. దూరంలో వున్న ‘ఝున్ ఝునూ’ నగరంలోనూ, ఆ జిల్లాలోని యితర పాఠశాలల్లోనూ రుూ ఏడాది ‘ఆర్.డే.’ అమోఘంగా చేసుకున్నారు. స్కూళ్లల్లో 6నుంచి 12 తరగతి దాకా చదువుకుంటున్న వాళ్లకి ఎప్పటిలాగే లడ్డూలు పంచిపెట్టారు. ఒక కమ్మని అతి పెద్ద లడ్డుండతోపాటు చక్కని చిన్న జనరల్ నాలెడ్జి-2017 పుస్తకాన్ని కూడా పంచి పెట్టారు.
ఆ జిల్లా కలెక్టర్ ఏటా కేటాయించబడ్డ రిపబ్లిక్‌డే సంబరాల సొమ్ముతో కొన్ని చందాలు కలిపి మొత్తం లక్షన్నర జి.కె.బుక్స్- తగ్గింపు ధరకి కొని, పంపిణీ చేయించాడు. అతని పేరు ప్రదీప్‌కుమార్. ఈ ఝున్‌ఝునూ నగరం గొప్ప టూరిస్టు అట్రాక్షన్. సందర్శకులెందరో, రుూ స్కూళ్లని కూడా చూసి మురిసిపోయారు.
‘‘సైకిళ్లు పంచాలనే సంకల్పం గవర్నమెంట్‌కి వుంది. అది వేరు. కానీ లాప్‌ట్యాపులు, టి.వి.లు, సైకిళ్లు కాదు, మెదడుకి మేత పెట్టాలి’’- అన్నాడాయన.
లడ్డూ తినేసి, చొక్కాకి ఆ చెయ్యి రాసేసుకుని ఆ పుస్తకం అవతల పారేసి పోడానికి కాదు- దాని మీద జూన్ నెల మొదటివారంలో ఆరవ క్లాసు దాకా ఒక స్థాయి- 6నుంచి 8 దాకా యింకో లెవెలు, ఆనక 12. దాకా మరో ‘‘లెవెల్’’ కంపల్సరీ ఎగ్జామ్ పెడతారు. భారీ బహుమతులు కూడా వుంటాయి. అలాగే పనిష్‌మెంట్లు కూడా వడ్డిస్తారుట!
ఈ కలెక్టర్‌గారు మంగళవారం ఢిల్లీకి పోయి అక్కడ, ‘ఆడపిల్లల సంరక్షణ పథకం ద్వారా చేసిన సేవలకి అవార్డు అందుకుని- ఆర్.డే.నాడు జెండా పండుగకి తిరిగి వచ్చేశాడు. గొప్ప ధీశాలి కదూ....