సబ్ ఫీచర్

నిగనిగలాడే కురుల కోసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆముదం అంటేనే చాలామందికి ఎలర్జీ. ఒకప్పుడు చిన్న పిల్లలకు ఉగ్గు తాగించేవారు. ఈ ఉగ్గులో ఆముదం ఉండేది. పిల్లలకు కడుపు నొప్పి రాకుండా పెద్దలు ఈ పనిచేసేవారు. కాని నేడు పిల్లలకు ఆముదం తాగిస్తే వైద్యులే యికోవటం లేదు. అన్నింటికీ మందులే. ఆముదం తాగిన మొహంలా పెట్టావని కూడా కొంతమంది ఎగతాళి చేయ టం చూస్తుంటాం. కాని ఈ ఆముదం వల్ల ఎన్నో ఉప యోగాలు ఉన్నాయ. గతం లో పసిబిడ్డలకు జుట్టు పొడవుగా, మం దంగా పెరగటానికి ఆముదం రాసేవారు. ముఖంపై మొటిమలు వస్తే రోజూ ఆముదంలో పసుపు కలుపుకుని రాసుకుంటే ముఖం కాంతివంతంగా ఉం టుంది. అంతే కాదు మొటిమలు తగ్గి పోతా య. జన్యుపర లోపం ఒత్తిడి, మానసిక కారణాలు, జీవనశైలిలోలోపంతదితర కార ణాల వల్ల కలిగే బట్టతలను తగ్గించేందుకు ఆము దాన్ని వాడతారు. పొడి జుట్టుకు కావాల్సిన పోషకాలను అందించి, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తలపై చర్మం పొడిగా మారటా న్ని నివారిస్తుంది. ఆహార తయారీలో వాడటంవలన జుట్టు రాలటం తగ్గి, వత్తుగా మారుతుంది.
ప్రతిరోజూ క్యాస్టర్ ఆయిల్‌ను వెంట్రుకల మొదళ్ళనుం డి చివరివరకు రాసుకున్న తరువాత, ప్లాస్టిక్ క్యాప్‌తో కప్పం డి లేదా టవల్‌తోచుట్టి ఉంచండి. ఇలా ఆయిల్ 15నుండి 20 నిమిషాలపాటు ఉంచండి లేదా పూర్తి రాత్రివరకు అలానే ఉంచండి. తరువాత మంచి షాం పూతోగానీ, కుంకుడు రసంతో గానీ జుట్టును కడిగి వేయండి. ఇలా 8వారాలపాటూ, వారానికి ఒకసారి చేసి ఫలితాలను గమనించండి. కేవలం ఆ ము దం మాత్రమేకాకుండా, దీని ని ఆలివ్ ఆయిల్, గ్రేప్ సీడ్ లేదా కొబ్బరి నూనె లో కలిపి కూడా వాడవచ్చు. ఇతర ఆయిల్‌లతో జోడించి వాడటంవలన మంచి ఫలితాలను పొందుతారు. తగినంత విశ్రాంతి, రోజు వ్యాయామా లు, ఒత్తిడి అధిగమిం చే ధ్యానం వంటి వాటిని అనుసరించటంవలన జుట్టు పొడవుగా, మందంగా బలంగా ఉంటుంది. మీ జుట్టు పలుచగా మారినట్టు అనిపిస్తే అద్దంలో చెక్ చేసుకోండి. ఇన్ని రకాలుగా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆముదాన్ని వాడి, మంచి అందమైన శిరోజాలను పొందండి.