Others

మీనా నైనిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్ కడుపున హీరోయిన్ పుడుతుందేమో అన్నట్లుగా మీనా కూతురు నైనిక ఇపుడు బాలనటిగా తమిళ తెరపై దర్శనం ఇవ్వబోతోంది. మీనా కూడా మొదట్లో బాలనటిగానే తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సీతారామయ్యగారి మనవరాలుతో కెరీర్ టర్న్ అయి పెద్ద హీరోయిన్‌గా మారి సూపర్‌స్టార్‌లందరి సరసనా నటించి శభాష్ అనిపించుకుంది. ఇపుడు అదే దారిలో మీనా కూతురు నైనిక కూడా సాగుతోంది. వయసుకి ఆరేళ్ల పాప అయినా కానీ, నటనలో మాత్రం ఏ తక్కువ కానంటోంది నైనిక. తాజాగా తమిళంలో విజయ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న తేరి చిత్రంలో నైనిక నటిస్తోంది. ద్విపాత్రాభినయంలో హీరో నటిస్తుంటే, నైనిక మాత్రం అతని కూతురుగా నటిస్తూ సెట్లో మార్కులు కొట్టేస్తోందట. ఓ రకంగా విజయ్‌కి సమ ఉజ్జీగా నటనలో ఫోజులిస్తోందట. తండ్రీ కూతుళ్ళ కథ కావడంతో ఆమె పాత్రకు ఇంపార్టెన్స్ కూడా బాగానే వుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సో.. మీనా కూతురు నైనిక విజయ్‌తో కలిసి నటించిన ఆ చిత్రం విడుదలైతే కానీ నైనిక సత్తా తెలియనుంది.