AADIVAVRAM - Others

ప్రార్థన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ పండుగ రోజున గుడికి వెళ్లాను. దైవ దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని గుడి అరుగు మీద కూర్చున్నాను. గుడికి నాతో వచ్చిన ముసలాయనకి ఒక కాలు అవిటి, పాపం కుంటుతూనే నడిచాడు. ఆయన నెమ్మదిగా వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. మొదటి నుండి గమనిస్తున్న అతనిని ఒక ప్రశ్న అడగాలనిపించింది. ధైర్యం చేసి మిమ్మల్ని ఒకటి అడగనా అన్నాను. దానికేం అడుగు అన్నాడు. ఇటువంటి అవిటితనం ఎందుకు ఇచ్చావు అని ఎప్పుడైనా దేవుని కోపగించుకొన్నారా అన్నాను. వెంటనే ఆయన నాకంటే ఎక్కువ బాధలతో పుట్టి, కనీసం నాలాగా నడవలేని అవిటి వారి కంటే మెరుగైన జీవితం నాకు ప్రసాదించినందుకు నిత్యం ఆ దేవుడికి సహస్ర నమస్కారాలు పెడతాను.
నీకు రెండు నగ్న సత్యాలు చెబుతాను. ఎప్పటికీ మరవద్దు. మొదటిది, ఆరోగ్యంలో మనకన్నా ఎక్కువ బాధ పడేవారిని చూసి ఆ దేవుడికి కృతజ్ఞతతో ప్రార్థించాలి. రెండవది, మనకన్నా తక్కువ సిరి సంపదలు కలవారిని చూసి ఆ దేవుడికి కృతజ్ఞతతో ప్రార్థించాలి. అప్పుడే తృప్తిగా హాయిగా జీవించాలి అనిపిస్తుంది.

- చామర్తి వెంకట రామకృష్ణ