AADIVAVRAM - Others

ఎవరు ఫెళ్లాడాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలుగురు స్నేహితులు దూర ప్రయాణం చేస్తూ ఒక అడవిలోకి ప్రవేశించారు. చీకటి పడింది. ఒక చెట్టు కింద పడుకున్నారు. క్రూరమృగాలు రాకుండా వంతుల ప్రకారం మేలుకున్నారు.
వాళ్లు నలుగురూ నాలుగు విద్యలు తెలిసిన వాళ్లు. బ్రాహ్మణుడు, వడ్రంగి, బట్టలు కుట్టే వ్యక్తి, స్వర్ణకారుడు.
మొదట మేలుకుని ఉండే వంతు వడ్రంగిది. కాంతి కోసం చిన్ని దీపం వెలిగించాడు. నిర్మల వాతావరణంలో ఏదయినా బొమ్మను చెక్కుదామని అనుకున్నాడు. దగ్గర్లో ఒక కొయ్యదుంగ కనిపిస్తే ఉలి తీసుకుని అందమైన అమ్మాయి రూపంలో బొమ్మను చెక్కాడు. రెండు గంటలపాటు ఏకాగ్రతగా చెక్కాడు. తను చెక్కిన బొమ్మ సౌందర్యానికి తనే ముగ్ధుడయి పరవశించి ఆ రూపానే్న మనసులో నిలుపుకుని పడుకున్నాడు.
తరువాతి వంతు బట్టలు కుట్టే వ్యక్తిది. ఆ బొమ్మను చూసి ఇంత అందమైన బొమ్మకు మంచి బట్టలు ఉంటే మరింత అందాన్నిస్తుందనుకుని రెండు గంటలపాటు బట్టలు కుట్టి బొమ్మను అలంకరించి సంతృప్తిగా పడుకున్నాడు.
ఆ తరువాత స్వర్ణకారుడి వంతు. సజీవంగా ఉన్న ఆ స్ర్తి విగ్రహాన్ని చూసి ఈ విగ్రహాన్ని తళతళలాడే నగలతో అలంకరిస్తే అపూర్వంగా ఉంటుందనుకుని రెండు గంటలపాటు శ్రమించి నగలతో బొమ్మను అలంకరించాడు.
చివరి వంతు బ్రాహ్మణుడిది.
అతనా విగ్రహాన్ని చూసి నిశే్చష్టుడయి యింత అందంగా ఉన్న బొమ్మ నిజంగా ప్రాణం పోసుకుంటే ఎంత బావుంటుందని ఆ బొమ్మకు ప్రాణాన్ని పొయ్యమని దేవుణ్ణి ప్రార్థించి నిద్రపోయాడు.
ఉదయానే్న నిద్ర లేచేసరికి సజీవంగా తమ ముందు నిల్చున్న అపూర్వ సౌందర్య రాశిని చూసి నలుగురూ ఆశ్చర్యపోయారు.
నలుగురూ ఆ అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానంటే నేను చేసుకుంటానని గొడవ పడ్డారు.
‘మొదట చెక్కింది నేను కనక ఆమె నా భార్య’ అన్నాడు వడ్రంగి.
‘ఆమెకు బట్టలు కుట్టి నేను వెయ్యకుంటే అసహ్యమయిన బొమ్మగా మిగిలేది’ అన్నాడు బట్టలు కుట్టే వ్యక్తి.
‘నేను ఆభరణాలు అలంకరించినందువల్లే ఆమెకంత సౌందర్యం వచ్చింది. కనుక నేనే పెళ్లాడాలి’ అన్నాడు స్వర్ణకారుడు.
బ్రాహ్మణుడు ‘నేను ప్రాణం పొయ్యకుంటే ఆమె మానవమూర్తిగా మారేది కాదు. కాబట్టి నేనే పెళ్లాడాలి’ అన్నాడు.
అప్పుడే దేవుడు ఒక సన్యాసి రూపంలో అటుగా వచ్చాడు. నలుగురూ తమ సమస్య చెప్పి అతన్ని పరిష్కారమడిగారు.
దేవుడు ‘వడ్రంగి, బ్రాహ్మణుడు ఆమెకు తండ్రితో సమానులు. కారణం వాళ్లు ఆకారాన్ని, ప్రాణాన్ని ఇచ్చారు. బట్టలు కుట్టే వ్యక్తి ఆమెకు సోదర సమానుడు. మాన సంరక్షణ చేసేవాడు సోదరుడి లాంటివాడే కదా! ఇక నగానట్రా భార్యకు కొని పెట్టేవాడు భర్తే కదా! అందుకని స్వర్ణకారుడే ఆమెకు తగిన భర్త’ అన్నాడు.
స్వర్ణకారుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
*

- సౌభాగ్య, 9848157909