Others

త్యాగమే మహోన్నతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం కర్మభూమి. పుణ్యభూమి. సనాతన ధర్మానికి వేదిక. అమృతత్వోపాసనయే మనిషి ధర్మం అని చెప్పే దివ్యభూమి ఇది. మనిషి పుట్టగానే సరిగాదు పుట్టినందుకు జన్మ సాఫల్యానికి త్యాగమే మహోన్నతం అని తెలుసుకోవాలంటుంది భారతీయం. అటువంటి భారతదేశానికి యయాతి ఒక మహారాజు. ఆ మహారాజుకు ఇద్దరు భార్యలు. ఒకరు ధర్మానే్న శాసించే నేర్పు ఒడిసిపట్టిన శుక్రాచార్యుని కూతురు దేవయాని. మరొకరు ధర్మపరుడు ప్రజలను కన్నబిడ్డలవలె చూస్తాడన్న కీర్తిపొందిన వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. ఒకసారి యయాతి శర్మిష్ఠ విషయంలో దేవయాని కోపానికి గురైనాడు. పుత్రికావాత్సల్యంతో శుక్రాచార్యుడు యయాతిని ముదిమితనం ప్రాప్తించేటట్లుగా శపించాడు. యయాతి వేడుకోలుకు కరిగిన శుక్రాచార్యుడు తిరిగి ఈ యయాతి వృద్ధాప్యాన్ని నీ కొడుకుల్లో ఎవరైనా ధరిస్తే వారి యవ్వనం నీకు సంప్రాప్తించేటట్లు చేస్తానని చెప్పాడు.
యయాతి చింతించాడు. కొడుకులంటే యువకులు. వారు యవ్వనాన్ని నాకెందుకు ఇస్తారు అట్లా తీసుకోవడం కూడా తప్పే కదా అని ఆలోచించాడు. కాని తన కుమారుల మనస్సు తెలుసుకొందామని దేవయాని వల్ల తనకు కలిగిన యదువు, తుర్వసుడు శర్మిష్ఠ వల్ల కలిగిన ద్రుహ్యుడు అనువు, పూరుడు అను వారిని పిలిచి తన శాపాన్ని ఆ శాపవృత్తాంతాన్ని తెలియబర్చాడు. ఆ తరువాత తనకు ఎవరు యవ్వనాన్ని ధారపోస్తారని అడిగాడు. మీ యవ్వనాన్ని నాకివ్వడమే కాదు తిరిగి నా వృద్ధాప్యాన్ని మీరు ధరించవలసి కూడా ఉంటుందని వారిని హెచ్చరించాడు.
అందరూ మాకు అంగీకారం కాదు అని నిర్మొహమాటంగా చెప్పారు. కాని పూరుడు తన తండ్రి పడే ఆవేదనను చూచాడు. అతని మనసు ద్రవించింది. తన తండ్రి దగ్గరకు వెళ్లి ‘‘తండ్రీ! మీరు దేనికోసం చింతించకండి మీ వృద్ధాప్యాన్ని నేను ధరిస్తాను. నా యవ్వనాన్ని మీరు తీసుకోండి’’ అని ఎంతో సంతోషంతో చెప్పాడు. యయాతికి చాలా ఆనందం కలిగింది. ఆ పూరునితో ‘‘ఓపూరుడా! నా గురువైన శుక్రాచార్యుడు ఎవరైతే ఈ నా వృద్ధాప్యాన్ని గ్రహిస్తారో వారికే నా తదనంతరం రాజ్యం ప్రాప్తిస్తుందని వారే రాజ్యానికి వారసులని కూడా తెలిపారు.’’ దాని వలన నీవే ఈ రాజ్యానికిరాజువు అవుతావు. అంతేకాదు నీవు చేసిన ఈ త్యాగం వల్ల గార్హస్థాశ్రమపు గొప్పతనం తెలిసింది. త్యాగేనైక అమృతత్వ మానశుఃఅనే వేదసూక్తికి నీవే మచ్చుతున్కవు. నీ వల్ల నా వంశ చరిత్ర అజారామరం అవుతుంది. గృహస్థాశ్రమంలో ఎవరికి వారు కాక అందరూ అందరికోసం జీవించాలనే నేర్పును కలిగి ఉండాలని చెప్పే నీ నడవడిక భావి భారత పౌరులకు మార్గదర్శి కాగలుతుందని యయాతి పూరుణ్ణి ఆశీర్వదించాడు. శరీరం ముఖ్యమనుకొనేవారు రాక్షస ప్రవృత్తిగలవారుగాను, మనస్సే ముఖ్యమనుకొనేవారు మానవులుగాను మానవత్వాన్ని పుణికి పుచ్చుకుని పరోపకారం మిదం శరీరం అన్న నానుడికి ప్రతిరూపంగా జీవించ గలగడమే మనిషి కర్తవ్యం అని చెప్పే ఈపూరుని కథ నేటి పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిందే. ఆచరించవలసిందే.

- ఎస్. నాగలక్ష్మి