Others

అవ్వని పొడిచిన ‘ఆవు’ కోసం గాలింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిట్ అండ్ రన్ కేసులు అంటాం- అలాగే శకటాలే కాదు చతుష్పాద జంతువులు కూడా యిలాంటివి చేస్తాయిట. బంగలూరులోని ‘అడిగొడి’ ప్రాంతంలో ఓ ‘గోవు మాలచ్చిమి’ ఒక వయోవృద్ధురాలి మీద కొమ్ము విసిరింది. కాని, పాపం! ఆమె ఆ పోటుకి తట్టుకోలేక కుప్పకూలింది. ఈ బాధితురాలి కుమారుడు ఒక హెడ్ కానిస్టేబుల్. దాంతో అతడు- ‘‘మా అమ్మనే పొడుస్తావా? దొంగ గొడ్డా!’’ అంటూ పోలీస్ స్టేషన్‌కి పోయి ఆ ప్రాంతంలో ‘గోవుల గోపన్న’లు ఎంతమందున్నారో- అందర్నీ తమ తమ ఆవుల్ని తొలుకుని పోలీస్ స్టేషన్‌కి రమ్మన్నాడు. కానిస్టేబుల్స్‌ని నాలుగు దశలా త్రోలాడు. పాపం! ఆవు, యజమానీ వుంటే దూడతో సహా పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు, ఆవులను వెంటేసుకుని. ‘ఆవు’ చెప్పలేదు కదా? ‘‘నేనే పొడిచాను, పారిపోయాను’’ అని- బాధితురాలు ఏ ఆవుమీద అనుమానం వ్యక్తం చేస్తే దాన్ని అరెస్టు చేస్తారు. ఆనక, ఆ గోమాలచ్చిమి మీద కేసు పెడతారు అని పోలీసు స్టేషన్ వర్గాలు చెబుతున్నారు. కేసు పైకోర్టుదాకా లాగుతుందా? అంటే, అసలు ఆ ఆవు దొరికాక- దాని యజమాని ఓ ‘పిల్ల పెట్టుబడిదారుడు’ అయితే ఆనక అప్పుడు కథ రంజుగా సాగుతుంది. ఏటంటారు?