Others

సౌందర్యాన్ని పెంచే బొప్పాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరుగుతున్న వయసును కనిపించనీయకుండా, వార్థక్యం దరికి రాకుండా చేయగలిగే ఒక అద్భుత ఫలం ‘బొప్పాయి’. చర్మ సౌందర్యానికి, ముఖ సౌందర్యానికి బాగా పనిచేసే బొప్పాయి చాలా మంచిది. టీనేజ్‌లో ముఖమంతా మొటిమలు వచ్చి ఎండిపోయి చర్మం గురుకుగా తయారవుతుంది. దీనివల్ల ముఖ సౌం దర్యం పాడైపోతుంది. దీనికి బొప్పాయి మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది. తొక్కతో సహా బొప్పాయి పండుని తరిగి, దానిని ముఖానికి మసాజ్ చేసుకోవాలి. అలా చేస్తే క్రమంగా మొటిమలు పోయి, గరుకుగా వున్న ముఖం కోమలంగా, మృదువుగా తయారవుతుంది. వయసు పైబడినపుడు చర్మంపైన వచ్చే ముడతలను కూడా బొప్పాయి తొలగిస్తుంది. తొక్కతో సహా బొప్పాయి పండు ముక్కను తీసుకుని ముడతలున్న చోట రాస్తూండాలి. ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే చర్మంపైన ముతడలు పోయి, చర్మం యవ్వ న శోభతో మెరిసిపోతుంది. ఎండిపోయిన చర్మంతో వున్నవారు రెండు చెంచాలు బాగా పండిన బొప్పాయి గుజ్జు, ఒక చెంచా విటమిన్ ఆయిల్, కొద్దిగా దోసగింజల పొడి చేర్చి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ పేస్టుము ముఖంపైన, మెడపైన రాసుకోవాలి.