Others

ఇట్లు ప్రేమతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశమంత నమ్మకం.. భూమంత బంధం పెనవేసుకున్న బంధమే ప్రేమ. పలికేందుకు రెండక్షరాల్లో ఇమిడినా.. భావం మాత్రం అనంతం. దానికి వర్ణాలు.. వర్గాలూ లేనే లేవు. నాకు నీవు.. నీకు నేనే అనే రెండు హృదయాల స్పందనలతో మొగ్గ తొడిగే ఈ ప్రేమ కావ్యానికి చివరి పేజీ లేదు. కష్టాల సుడిగుండాలు ఎదురైనా.. కన్నీళ్ల ఉప్పెనలు చుట్టిముట్టినా.. కుంగిపోదు.. జంకిపోదు. నాకు నీ తోడుంటే చాలు.. ఈ ప్రపంచంలో ప్రతిరోజు నాకు నిత్య నూతనమే.. మనమిద్దరం ప్రేమలో ఒక్కటై కలసి సాగిపోదామంటూ బాసలు చేసుకునే రోజు.. ప్రేమికుల రోజు..
ప్రేమకు రూపం లేదు కానీ.. భాష ఉంది. భావమూ ఉంది. ప్రపంచ చరిత్రలో ప్రేమించని మనిషి లేడు. మగువా లేదు. ప్రేమపై కవిత రాయని కవీ లేడు. వేల భాషల్లో ప్రేమపై వచ్చినన్ని పాటలు.. సాహిత్యం మరెక్కడా కనిపించవు. దేవదాసు పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి నుంచి నేటి ప్రేమికుల వరకూ ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర. కొందరు పెద్దలను ఎదిరించారు.. మరికొందరు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. ఇంకొందరు ఎటూ చేయలేక పిరికిపందల్లా అమరులయ్యారు. ప్రేమ మనసులను కలిపింది. కులాల గోడలను బద్దలు కొట్టింది. ఉద్యమాలను ఉసిగొల్పింది. ప్రాణాలను నిలబెట్టింది. ప్రాణాలూ తీసింది. ప్రేమ, లవ్, ఇష్క్, కాదల్, మొహబ్బత్.. భాష ఏదైనా కానివ్వండి.. అన్నింటికీ ఒకటే అర్థం. అదే ఇద్దరి మనసులనూ కలిపే పదం.
స్వచ్ఛతకు సంకేతం ప్రేమ
క్రీస్తుశకం 270 ప్రాంతంలో రోమ్‌లో వాలెంటైన్ అనే ప్రవక్త ఉండేవాడు. ప్రేమవల్ల ప్రపంచం ఆహ్లాదంగా, ఆనందంగా మారుతుందని అతడి అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతీ యువకులకు ప్రేమోపదేశాలు చేసి, వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు. వాలెంటైన్‌కి రోజురోజుకూ అభిమానులు పెరిగిపోవడంతో రోమ్ రాజు క్లాడియస్‌కి భయం పట్టుకుంది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమపాఠాలు నేర్పి బలహీనులుగా తయారుచేస్తున్నాడన్న అభియోగంపై క్లాడియస్ వాలెంటైన్‌కి మరణశిక్ష విధించాడు. వాలెంటైన్ జైల్లో వుండి కూడా ఇంకొన్ని రోజుల్లో మరణిస్తానని తెలిసి కూడా ప్రేమ ప్రచారం ఆపలేదు. అక్కడున్న ఒక చెట్టు (రాగి చెట్టు లాంటిది- నిజానికి ప్రేమకి గుర్తుగా వాడే హార్ట్ గుండెకు గుర్తుగా వచ్చింది కాదు. ఆ ఆకుకి గుర్తుగా వచ్చింది) ఆకులను తెంపి వాటిపై ‘ప్రేమ ఎంతో గొప్పది, ప్రేమ లేనిదే ప్రపంచం లేదు, ప్రేమకి అపజయం లేదు’ లాంటి వాక్యాలని రాసి జైలు గోడ అవతల పారేసేవాడు. వాటిని ఆ జైలు జైలర్ కూతురు తీసుకువెళ్లి ప్రజలకు చేరవేసేది. తను చనిపోయే రోజు ఆ అమ్మాయికి ‘వాలెంటైన్ విత్ లవ్ వాలెంటైన్’ అని రాసిచ్చాడు. వాలెంటైన్ అభిమానుల్లో క్లాడియస్ కుమార్తె కూడా ఉండడం విశేషం. ప్రేమకు మారుపేరుగా మారిన వాలెంటైన్‌ను ఫిబ్రవరి 14న ఉరితీశారు. వాలెంటైన్ మరణించిన తర్వాత రెండు దశాబ్దాలకు క్రీ.శ.496లో అప్పటి పోప్ గెలాసియన్స్ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా ప్రకటించాడు. ఎక్కడో రోమ్‌లో అదీ శతాబ్దాల క్రితం జీవించిన ఒక ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచ ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది. ప్రేమలేఖతో మొదలై.. ఫేస్‌బుక్ వరకు ప్రేమ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది.

- నీలిమ సబ్బిశెట్టి