Others

ఆమెంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెమిని సినిమాతో యువతను గిలిగింతలు పెట్టిన నమిత గుర్తుంది కదా! తరువాత ‘సింగమంటి చిన్నోడు వేటకొచ్చాడే’ అంటూ సాగిన పాట కూడా గుర్తుతెచ్చుకోండి. కానీ, మొదటి నమిత వేరు. రెండో నమిత వేరు. మొదటి చిత్రంలో అందంతో ఆకట్టుకుంటే, తురువాతి చిత్రాల్లో ఎక్స్‌పోజ్‌తో పడగొట్టేసింది. నమితవుంటే చాలు, సినిమా నిండుగా కనిపిస్తుంది అనుకొని ఆమెకు అవకాశాలు బాగానే ఇచ్చారు. ఆ తరువాతే.. విపరీతమైన పర్సనాలిటీ వచ్చేయడంతో అవకాశాలు సన్నగిల్లాయి. దాదాపు మూడేళ్లుగా నమిత కనపడలేదు, వినపడలేదు. అయతే, ఈ మూడేళ్లు కఠోరమైన దీక్ష పూని మొత్తానికి మళ్లీ తన భారీ శరీరాన్ని తగ్గించుకుని రీఎంట్రీ ఇస్తోంది. తమిళంలో ఓ హరర్ చిత్రంలో కనిపించబోతున్నట్టు వినికిడి. ఈ చిత్రంలో బక్కపల్చగా వుండే భామగా, చూడటానికి భయంకరంగా వుండే గెటప్‌లో నటిస్తోందట. ఈ సినిమా విడుదలైతే కానీ నమిత అంటే హారరా? లేక హ్యూమరా?అనేది తెలీదు. సినిమా హిట్టయతే మాత్రం తెలుగు తెర కూడా నమిత కోసం మళ్లీ ఆరాటపడక తప్పదు.