Others

సామాన్య గృహిణులు..స్వశక్తికి ప్రతీకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచీకరణ నేపథ్యంలో భారతగడ్డపై విదేశీయ వస్తువులు ఎన్నో వాలుతున్నాయ. స్వదేశీ వస్తువుల ముందు అవన్నీ దిగదుడుపేనని నిరూపిస్తున్నారు మదనపల్లికు చెందిన బి.లలిత, విశాఖలోని జ్ఞానాపురానికి చెందిన దూబ రాజు. సహజ వనరులనే ముడిసరుకుగా ఎంచుకుని, మార్కెట్లో పోటీని తట్టుకుని ముందుకు సాగు తున్నారు. లలిత ఆవుపాలతో స్వచ్ఛమైన పాలకోవ, తీపి పదార్థాలు తయారుచేయంచి విక్ర యస్తుండగా, రాజు నాలుగేళ్ళు ప్రయోగాలు చేసి మూలికలతో ఉత్పత్తులు తయారు చేస్తూ అమ్మకాలు ప్రారంభించారు. ఆర్థిక సమస్యలు అధిగమించటమే కాకుండా పదుగురికి ఉపాధి కల్పిస్తున్నారు.

నాలుగేళ్ళు ప్రయోగాలు చేశా
ఒకసారి చింతపండుతో దేవుని సామగ్రి శుభ్రపరుస్తుంటే చేతికి చర్మ వ్యాధులు సోకాయి. ఆందోళన చెందాను. ఎలాగైనా ప్రత్యామ్నాయం కనిపెట్టాలని సంకల్పించాను. ఇంటర్‌లో సైన్స్ గ్రూపు కావడంతో నాలుగేళ్ళు ప్రయోగాలు చేశాను. చివరకు ఫలించిందని రాజు చెప్పారు. శివాని మహిళా పొదుపు సంఘం సభ్యురాలైన తాను 2015లో రూ. 15 వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాను. ఏడాదికి సుమారు రూ. లక్షా 20 వేల వరకు టర్నోవర్ జరుగుతుంది. మార్కెట్‌లో ఉన్న స్పందనతో తాను పేటెంట్ (నెం.201641 015297)కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. ఇల్లు, వాకిలి, ఇంట్లోని సామగ్రి పరిశుభ్రంగా, అందంగా ఉంటే కదా అందం, ఆరోగ్యం! అందుకే ఆర్‌ఆర్ హెర్బల్ పేరిట క్లీనింగ్ ఉత్పత్తులు తయారుచేసి, వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్లో దొరికే కొన్ని రసాయన క్లీనింగ్ ద్రవాల వల్ల ఇంటి పరిశుభ్రత మాట అటుంచితే మహిళల చేతివేళ్ళకు లేనిపోని చర్మవ్యాధులు సోకుతున్నాయి. ఈ భయం లేకుండా వెండి, రాగి, ఇత్తడి, కంచు తదితర లోహాల పాత్రలను, వస్తువులను సులభంగా శుభ్రపరుచుకునేందుకు నేచురల్, హెర్బల్ క్లీనింగ్ ద్రవాలను తయారుచేశాను. ప్రకృతిలో లభించే వివిధ రకాల వనమూలికలు, చెట్ల ఆకులు, బెరడులు, తీపి పదార్థాలు ముడిసరుకుగా వినియోగిస్తున్నాం. అపూర్వ ఆదరణ లభిస్తోంది. గృహిణిగా సంపూర్ణ బాధ్యతలు చేపడుతునే వ్యాపార రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. పనిలో వత్తిడి ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా సాయపడతారని లలిత, రాజు ఆనందం వ్యక్తం చేశారు.

రూ.50 వేల పెట్టుబడి.. 4లక్షల టర్నోవర్
లలితది వ్యవసాయ కుటుంబం. సుమారుగా 60 ఆవులు ఉన్నాయి. మోప్మా సాయంతో రుణం పొంది 2013లో వ్యాపారాన్ని ప్రారంభించారు. స్వచ్ఛమైన ఆవుపాలతో పాలకోవను తయారుచేస్తూ తోటి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. పది లీటర్ల స్వచ్ఛమైన ఆవుపాలతో రెండు కిలోల వరకూ కోవాను తయారు చేయొచ్చు. మొదటి రకం జీడిపప్పు పొడి, నెయ్యి, పంచదార తగినంతగా కలుపుతాం. మంచి రుచిగా ఉంటుంది. దీంతో వినియోగదారులు లొట్టలు వేసుకుని ఆరగిస్తారు. వ్యవసాయ కుటుంబం కావడంతో వేరే ఆలోచన లేకుండా ఈ వ్యాపారానే్న ఎంచుకున్నాను. ఆవుపాలను బయట మార్కెట్‌కు అమ్మకుండా కోవాకు వినియోగిస్తున్నాను. మొదట్లో మా తాతయ్య గోపీనాయక్ కోవా తయారు చేసి, ఇంటికొచ్చే వారికి అమ్మే వారు. తాను పూర్తిస్థాయి వ్యాపారంగా మలిచాను. రూ.50 వేల పెట్టుబడితో ప్రారంభించి, ఏడాదికి సుమా రు మూడు, నాలుగు లక్షల రూపాయల వరకూ టర్నోవర్ జరుగుతుందని తెలిపారామె.

- కృష్ణ