Others

ఐదో క్లాసుకే ‘బోర్డు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకి పదోక్లాసు దాకా బోర్డు పరీక్షలు లేవు. క్రింది క్లాసులో డిటెన్షన్లు లేవుగానీ వెనుకబడ్డ రాష్ట్రంగా పేరుబడ్డ రాజస్థాన్‌లో రుూ ఏడాది మార్చినుంచీ ప్రాథమిక విద్యాబోర్డువారు రాష్ట్ర స్థాయిలో ఒకే మాదిరి పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు- అలా అని రాష్ట్ర విద్యా మంత్రి ఉవాచ. ఈ పరీక్షల్లో ఫెయిలయితే మరో నెల చదువుకుని, మళ్లీ పరీక్షలు రాసే అవకాశం యిస్తారు తప్ప ఆరో క్లాసుకి ఎట్టి పరిస్థితులలోనూ వెళ్లనివ్వరు. రాష్ట్రంలో 9800 గ్రామ పంచాయితీలున్నాయి. అన్నింటా అయిదవ తరగతి ‘బోర్డ్’ ఎగ్జామ్స్ కామన్‌గా నిర్వహించాల్సిందే. బాగుంది కదూ! పునాది దిట్టంగా పడుతుంది. పబ్లిక్ పరీక్షలకి బొడ్డూడని పిల్లల్ని తయారుచేయాలి- అదే సమస్య!