Others

పుట్టగొడుగు ... ఆరోగ్యానికి ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కప్పు పుట్టగొడుగుల్లో మాంసంలో లభించే పోషకాలన్నీ ఉంటాయి. వీటిని తీసుకోవడంవల్ల శరీరానికి విటమిన్ డి అధికంగా లభిస్తుంది. వీటిలోని పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిల్లో వుండే విటమిన్ బి, రైబోప్లైవిన్, నియాసిన్ వంటి నాడీ వ్యవస్థకు మేలు చేస్తాయి. రైబోప్లేవిన్ ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. నియాసిన్ చర్మ సమస్యలను దూరం చేస్తుం ది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడు మీద కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. వీటిల్లో సెలీనియం ఉం టుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. శరీరంలోని క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. వీటిల్లో ఉండే రాగి ఎర్ర రక్తకణాలకు ప్రాణవాయువు సరఫరా సరిగా అందేలా చూస్తుంది. ఎముకలు దృఢంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. వీటిల్లో ఉండే మరో పోషకం.. పొటాషియం. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. పుట్టగొడుగుల్లో ఖనిజ లవణాలు, ఇనుము లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు తరచూ వీటిని తీసుకోవడంవల్ల కొవ్వు సమస్య బారిన పడకుండా ఉంటారు. రక్తహీనత కూడా బాధించదు. మధుమేహం ఉన్న వాళ్లు వీటిని ఎక్కువగా తింటే మంచిది. నీటి శాతం ఎక్కువగా ఉండడంవల్ల శరీరానికి తేమ అందుతుంది. ఇన్సులిన్ శాతం పెరుగుతుంది.

- నీలిమ సబ్బిశెట్టి