Others

మినుములతో మధుమేహానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గింజ ధాన్యాలలో మినుములకు ఎంతో ప్రాముఖ్య ఉంది. మినుములలో పోషక పదార్థాలు లభిస్తాయి. వీటితో ఎన్నో రకాలైన తీపి, కారం పిండి వంటలను తయారుచేస్తారు. దేహారోగ్యానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇవి అనారోగ్యాల నివారణకు ఔషధంలా పనిచేస్తాయి. వీటిని పిండి పట్టించి అప్పడాలు తయారుచేస్తారు. వీటిని నానేసి రుబ్బి, రకరకాలైన వడియాలను వేసవిలో తయారుచేసి ఎండబెట్టి గలగలా ఎండిన తర్వాత డబ్బాల్లో నిలవ ఉంచుకుంటారు.
మినుములు చలువ చేస్తాయి. కండరాలు బలపడతాయి. సయాటికా నడుం నొప్పికి ఉపశమనాన్ని కలిగించటమే కాక నివారణకూ తోడ్పడుతుంది. వాతాన్ని త్వరగా హరిస్తుంది. శరీరానికి శక్తిని కలిగిస్తాయి. మలబద్ధకాన్ని పోగొడుతుంది. మినుములు మొలకలతో పుచ్చరసం, తేనె కలిపి తీసుకుంటే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. కొన్ని నెలలపాటు ఈ విధంగా తీసుకోవాలి,. రక్తప్రసరణ సాఫీగా ఉంటుంది. అల్సర్‌వల్ల ఉదరంలో ఏర్పడే మంటకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. గుడ్డును సగం ఉడికించి మినుములతో కలిపి తీసుకుంటే నరాల బలహీనతను పోగొట్టి నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఎదిగే పిల్లలకు మినుములతో తయారుచేసిన పదార్థాలు పెడితే పిల్లలలో ఎదుగుదల, ఆరోగ్యమూ బాగుంటాయి. జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఉబ్బసవ్యాధికి ఔషధంలా పనిచేస్తుంది. మినుములను ఉడికించి మెత్తగా పేస్ట్‌లా చేసి, ఆ గుజ్జులో మెంతిపిండిని కలిపి తలకు పట్టిస్తే చుండ్రు సమస్యకు పరిష్కారం లభించటమే కాకుండా వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతాయి. అజీర్ణ వ్యాధిని పోగొట్టి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మినుములనుంచి తీసిన తైలాన్ని మోకాళ్ళకు మర్దనా చేస్తే మోకాళ్ళనొప్పులు తగ్గిపోతాయి. మినప సున్ని ఉండలను రోజుకు ఒకటి చొప్పున బాలింతరాలు తింటే, నడుము గట్టితనం ఏర్పడుతుంది. బిడ్డకు స్తన్యమిచ్చే తల్లి మినుములు లేదా మినప్పప్పును ఆహార పదార్థాల్లో వాడితే తల్లికి, బిడ్డకూ బలకరం. అనారోగ్యాలతో నీరసించినవారు మినుములతో చేసిన పదార్థాలను తింటే శరీరానికి శక్తి కలుగుతుంది.

-కె.నిర్మల