Others

నాకు నచ్చిన సినిమా --ఎప్పటికీ మానని గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో 1993లో వచ్చిన గాయం ఇప్పటికీ పచ్చిగానే వుండి, ప్రేక్షకులకు నచ్చుతూనే ఉంటుంది. జగపతిబాబుకు స్వరపరంగా ఆంధ్ర అమితాబ్ అన్న పేరును సార్థకం చేసింది. సినిమాలో కొంత భాగం జగపతిబాబు మేకప్‌తోనే వున్నా, దుర్గ అవతారం ఎత్తిన తర్వాత తల నూనెను ముఖానికి రాసుకున్నట్టుగా రఫ్ లుక్‌తో గ్యాంగ్‌స్టర్‌గా రాణించాడు. ఆ స్థాయి పాత్ర నేటికీ అతనికి రాలేదంటే అతిశయోక్తికాదు. టేకింగ్ కొత్తపుంతలు తొక్కింది. రేవతితో జోడి ఎలా కుదిరిందంటే వాళ్లెప్పుడు కలిసినా ప్రేక్షకులకు గిలిగింతే. ఎంతో హుందాగా నటించారు ఇద్దరూ. మొదట్లో చిలిపిగా ప్రవర్తించింది ఈ జంటేనా అన్నట్టు ఉంటుంది, సినిమా సాగేకొద్దీ. సంభాషణలు అతి క్లుప్తంగా సహజాతి సహజంగా కొన్నిచోట్ల హాస్యంగా, కొన్నిచోట్ల సీరియస్‌గా ఉంటాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్. ఇక కోట శ్రీనివాసరావు గురించి చెప్పుకోవాలంటే చోటు చాలదు. తనికెళ్ల భరణి, నర్సింగ్, ఊర్మిళ, అన్నపూర్ణ, చరణ్‌రాజ్, నారాయణరావు, బాలయ్య, బెనర్జీ, శివకృష్ణ ఎవరికి వాళ్లే ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు.
సర్కార్ పాత్రలో రామిరెడ్డికి డైలాగులు లేకపోవడం ప్రత్యేకత. అప్పటి చిత్రాలు తీసిన వర్మ వేరు. ఇప్పుడు తీస్తున్న వర్మ వేరు. అప్పటి వర్మనే గుర్తు చేసుకుంటే -గాయం అతని పనితనానికి పరాకాష్ట సినిమాల్లో ఒకటి అని గట్టిగా చెప్పొచ్చు. ఎప్పటికీ నచ్చే సినిమా అది.

-కాళిదాసు, కావలి