AADIVAVRAM - Others

మరో కోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్న ఉదయం మిమ్మల్ని కలవడానికి మీ మిత్రులిద్దరు వచ్చారు. మీరు త్వరగా వెళ్లిపోయారు కదా ఆఫీస్‌కి. అదే విషయం చెప్పాను. బాగా డిసప్పాయింట్ అయినట్టుగా కన్పించారు. రాత్రి కూడా ఆలస్యంగా వచ్చారు కదా.. చెప్పడం మర్చిపోయా’ అంటూ ఉదయం టీ టేబుల్ దగ్గర నాతో మా ఆవిడ చెప్పింది. అందులో ఒకరు తరచుగా కలిసే మిత్రుడే - అంతగా డిసప్పాయింట్ ఎందుకవుతారు అనుకున్నా. ఈమె ఎలా అర్థం చేసుకుందో ఎందుకలా అన్పించిందో - అని ఆ మిత్రుడితో మాట్లాడదామని ఫోన్ చేశాను.
కింద కారుంది. డ్రైవరున్నాడు. నేనింట్లో ఉన్నాననుకొని పైకి వచ్చిన మిత్రులకి ఆఫీస్‌కి వెళ్లిపోయానని చెప్పిన మాట నమ్మశక్యంగా తోచలేదు. ఇంట్లో వుండీ లేనని చెప్పిస్తున్నానేమోనని అనిపించింది. తొమ్మిదింటికల్లా వెళ్లిపోయానా ఆఫీస్‌కి అనుకున్నట్టుంది. జరిగింది ఏమిటంటే - ఆ రోజు మా ఆవిడకి కారు అవసరం ఉంది. అంతే. నేనూ త్వరగా వెళ్లాల్సిన అవసరం ఉంది కనుక, మా కొలీగ్ కారులో అతనితో కలిసి వెళ్లిపోయాను. కింద కారుని చూసి పైకి వచ్చిన వారికి నేను ఇంట్లో లేననేసరికి నమ్మశక్యంగా తోచలేదు. నేను ఫోన్ చేసి మాట్లాడేసరికి వారి అనుమానం పటాపంచలై పోయింది. నిజమైన మిత్రులకి ఇంటి ద్వారాలు, హృదయపు ద్వారాలు ఎల్లవేళలా తెరిచే ఉంటాయన్న సంగతి అర్థమైంది.
బాగా సన్నిహితులైన మిత్రులే సరిగ్గా అర్థం చేసుకోలేదని అన్పించింది.
నేను ఫోన్ చేసి విషయం చెప్పిన తరువాత గానీ వాళ్లకి అసలు విషయం బోధపడలేదు.
ప్రతి విషయానికీ మనకు కన్పించని మరో కోణం ఉంటుంది. కొంచెం ఆలోచించి చూస్తే తప్ప అసలు సంగతి అంతుపట్టదు. ప్రతి విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి.
క్రింద కారూ, డ్రైవర్ కన్పించగానే ఇంట్లో నేను ఉన్నానని ఊహించుకోవడం సరైందేమో కానీ నేను లేనని మా ఆవిడ చెప్పిన సమాధానం తప్పని అనుకోవడం పొరపాటు.
మా మిత్రులు ఇదే విషయం నాకు చెప్పారు.

- జింబో 94404 83001