Others

హీరో అను నేను...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హీరో అను నేను- ఇప్పటి నుండి విభిన్న పాత్రలే చేస్తానని, వైవిధ్యమైన సినిమాలే ఒప్పుకుంటానని, ఇక రొటీన్ కథల జోలికిపోనని, విలక్షణ ఆహార్యం, వినూత్న కథనానికే పెద్ద పీట వేస్తానని, నలిగిన సీన్లలో నటించనని స్క్రిప్ట్‌మీద ప్రమాణం చేసి ప్రేక్షకుల సాక్షిగా పవిత్ర వెండితెర ముందు వాగ్దానం చేస్తున్నాను’
**
గిదంతను వద్దనుకునేరు మల్ల. పొద్దుగాల పొద్దుగాల బడిలో పిల్లగాండ్లంత మైదానంల జేరి పతిన బూనినట్టుగ... తెల్గు ‘వీరో’లంత గిట్ల వర్సగ నిలవడి గామాటలు సెప్పినట్టు కలచ్చింది.. గంతే!
మన తెల్గు సిన్మ హీరో నిజంగ గిసువంటి నిర్ణయం దీసుకుంటె మనసొంటోల్లకి సంబురమే సంబురం గదూ? లేకుంటే ఉతికి ఉతికి ఆరేత్తె సితికిపోయిన సీర గట్టుకొని ముత్తాబైనట్టు.. మల్ల గిసువంటి సిన్మాలేంది? ఓ రొడ్డకొట్టుడేంది? గీ యేడాది నూరుకు పైగా తెల్గు సిన్మలచ్చినయ్ గదా... ఎన్నిట్ల ఎన్ని సిన్మలు జూసి మనకు లవు సంబురమైంది? పదో పరుకో గదా. మరి గవిగూడ ఏదన్న డిపరెంటుగ ఉన్నాయా? అంటే చారాన మందమని సెప్పుకోవాలె.
సంబురాలు, సక్సెస్‌లు, బాక్సాపీసుల కొల్లగొట్టుడు.. గిసువంటి మాటలు జరంత సేపు పక్కన వెట్టుండ్రి. రోజులు జరగవట్టె... మన తెల్గు సిన్మల సంఖ్య పెరుగవట్టె... గంతేగాని పరాయోల్లు ఎవలన్న మెచ్చుకున్నర...? ఎన్ని సినిమ్మల్ని ఆకాసానికెత్తిన్రు? ఆహా ఓహో అన్నరు? తెల్గుల గీ సిన్మ మంచిగుందట. బలే తీసిండ్లట అని! ఆస్కారుకి అర్హమయ్యే సినిమ్మనో... తెల్గు సినిమ్మ సెరిత్రని తిర్గరాసే సినిమ్మనో... మనసోంటి ప్రేక్షకుడి గుండెలో సిరస్థాయిగ నిలిచిపోయే సినిమ్మనో మనోల్లు తీత్తలేందుకని? ఏం సమజైతలేదుండ్ల! గుబులైతంది గీ సినిమ్మల ముచ్చట వెడ్తుంటె. సంఖ్య పెరుగవట్టె! సంబురం తర్గవట్టె!
కొత్తదనం మాటే లేదాయె! దాని ఊసే లేదాయె! పాడిందే పాడర పాసుపండ్ల దాసరి అన్నట్టు.. తీసిందే తీసుడా! మంచి గున్నరు సినిమ్మోలు! జరంతనన్న గమ్మత్తుగనో, ఎరైటిగనో తీత్తేమైతదో? ఇగ మన ‘వీరో’లు మార్నే మారరా? ఏందివయా గీ సిన్మలు.. గిట్ల జేత్తున్నరేంది? నెయ్యి లేని బీరకాయుంటది గాని, కతలేని సినిమ్ముంటదా? గీల్లు గిట్లనే జేయవట్టిరి మరి! కత లేదు, కాకరకాయ చేదు... తుపాల్, తుఫాల్... లేదు అనవోయి, చేదు అన్న... జర సరిజేసుకోండ్రి.
మిగతా బాసలల్ల హీరోలు గమ్మత్తు గమ్మత్తు పాత్రలేత్తుంటే.. గదేమంటరు... బయోపిక్కులు గూడ ఏత్తుంటే, ఒక్కలన్న మన తెల్గు వీరోలు గిసువంటి దిక్కన్న సూత్తున్నరా? మాసు, మాసు... అబ్బబ్బ మాసే మాసు! గదే బండ్లు పైకి లేపుడు, గా బుజ్జమ్మలెంట పడి తైతక్కలాడుడు. సప్పట్లకోసరమని బండెడు బండెడు డవలాగులు, ఎనే్నండ్లు సూసుడివి...?
గా మనె్దన మోహన్‌లాల్ జూడుండ్రి ‘గుడ్డి’ పాత్రేసిండు. సల్మాన్ ‘సుల్తాన్’ ఏసం గట్టిండు. మల్ల అమీర్ ‘యుద్ధం’ (దంగల్) జేసిండు. గీల్లంత కోట్లు కొల్లగొట్టలేదా? మరి మన ‘వీరోలు’ గొంతనన్న తెలివి తెచ్చుకుంటలేరెందుకని? ఎప్పుడు జూడు ‘కమర్షియల్’ పంథానేనా? జరంతైనా కొత్త కొత్త కతాలోచన్లు లేవా? ఏం మంచి గనిపిత్తలేదుల్ల మనోల్లను జూత్తుంటె! ఏ సెట్టూలేని కాడ ఆముదం సెట్టు... అన్నట్టు మనకి మనం సముదాయించుకొని సిన్మలు సూసుడు తప్ప...!
గొంతలో గొంత నాగ్ కుర్సీల గూసొనే పాత్రేసి, మనోల్లు గూడ మంచి పాత్రలేత్తరనేట్టు జేసి జరంత ‘ఊపిరి’ దీస్కునేటట్టు జేసిండు. గిట్లనే బగ్గ దినాలయ్యింది గదాని బాలయ్యగూడ జర చరిత్ర జెప్త సూడుండ్రి అన్నట్టు ‘గౌతమీపుత్రుడి’ ఏసం గట్టిండు. మల్లగదే నాగ్ ‘హథీరామ్’నంటూ అత్తుండు. మొన్న ‘ఊరు దత్తతంటు’ మంచి సందేసంతోనే మహేశ్ గూడ ఎరైటిగనే అచ్చిండు. మరి గిసువంటి సినిమ్మలు గూడ హిట్టవుతున్నయి గదా? గట్లగని... అటు ఇటుగాని సినిమ్మలు తీసుడేంది? జర టాప్ యంగ్ హీరోలన్నా మంచి మంచి పాత్రలేయ రాదుండ్రి? మూడ్నాలుగు జేమ్స్‌బాండ్ సినిమాలల్ల ఏసంగట్టిన ఇంగిలీసు హీరోనే, జేమ్స్‌బాండు పాత్రలంటె మొహంమొత్తిందని, మల్ల నటించనని మొన్నటికి మొన్న మొండికేయలేదా? (రెమ్యునరేషన్ బగ్గ పెంచి ఆస సూపిత్తె మల్ల ఒప్పుకున్నడంట, గది ఏరే ఇసయం!). ఎందుకిట్ల జేత్తున్నరో మన వీరోలు?
గా ‘సుప్రీమ్’ ఫేమ్ అనిల్ రావిపూడి ఓ అంధుడి పాత్రతో ఎరైటీ కతల్లుకుని మన తెల్గు యంగ్ వీరోల సుట్టూ తిరిగిండంట. గాల్లందరు ‘నై నై’ అంటూ రిజెక్ట్ జేసిండ్రని సినిమ్మోల్లు సెవులు కొరుక్కున్నరు. గట్లయితే ఎట్ల? ఎవలన్న మల్లమల్ల ముందుకత్తరా కొత్త కొత్త సినిమ్మలు తీయనీకి?
మరెందుకు మన వీరోలు ఒక ‘ప్రయోగం’ కోసం పరితపించడం లేదు? స్టారు వాల్యూ తగ్గుతుందనా? సక్సెస్ గ్రాఫు దిగుతుందనా? ఆస్కార్లూ, జాతీయ అవార్డులొత్తె... పేరెక్కడ మార్మోగుతుందోననా? ఒక విలక్షణత కోసం, ఒక వైవిధ్యం కోసం, ఒక నూతన ఒరవడి కోసం మన వీరోలు ఎందుకు పరుగుపెట్టడం లేదు?
ఒకట్రెండు కమర్షియల్ సినిమాలల్ల ఏసం గడితే, మద్యమద్యల కనీసం ఒక సినిమ్మనన్న కొత్తకొత్త గుండేటట్టు జర సూసుకో రాదుండ్రి..? సొచాయించుండ్రి జర...!
సరేగని, సినిమ్మ టైమైందిగా టాకీసుల కొత్త సినిమ్మ పడ్డదట. మా నర్సిగాడు సెప్పిండు. సూడనీకి వోతున్న. అగో! నవ్వుతరేంది? ఎట్లున్నగని టాకీసుల సినిమ్మ సూడకపోతే. మనసున వడ్తదా? గందుకే వోతున్న మరి! టిక్కెట్లున్నయో, ఐపోయినయో గని! ముచ్చట్లపడి టైమే జూస్కోపోతి? మంగళారం గోలె... మల్లెప్పుడన్న అత్త తీయిండ్రి, మల్లమంచిగ సినిమ్మ ముచ్చట్లు వెట్టుకుందం గని, ఉంట మల్ల.

-ఎనుగంటి వేణుగోపాల్