Others

వందరోజులైనా తేలని కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్లు రద్దయి, దేశవ్యాప్తంగా కొత్త కరెన్సీ చెలామణిలోకి వచ్చి వంద రోజులు దాటింది. పాతనోట్లు ఇక చెల్లవని ప్రభుత్వం ప్రకటించింది. ‘దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది.. ఇక అంతా మంచిరోజులే.. అక్రమార్కులకు గడ్డుకాలం..’ అని ప్రధాని మోదీ కథలు చెప్పి వంద రోజులు దాటింది. ఈ పరిణామాలతో ఏదో జరుగుతుందని యువత కలలు కని, రకరకాల కథలు చెప్పుకోవడం ప్రారంభించి వంద రోజులు దాటింది. అయితే, అసలు కథ మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదన్నమాట నిజం.
నల్లకుబేరుల భరతం పడతామని చెప్పిన కేంద్రం ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో సాధించింది ఏమిటో? ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లుగా దిల్లీ పెద్దలు అనుసరిస్తున్న వైఖరి ప్రజలను పలు అనుమానాలకు గురి చేస్తోంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని పాలకులు ప్రజల కోసం తీసుకున్నారా? వారి ప్రయోజనాలు ఏవైనా దీని వెనుక దాగి వున్నాయా? అని ప్రతిఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఇక తాము ఎంత ఆలోచించినా ఏమీ లాభం లేదన్న విషయం సామాన్యుడికి తెలియదు. ఎందుకంటే ఓటువేసిన సామాన్యుడి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు.
విదేశాల్లో దాగిన నల్లధనాన్ని భారత్‌కు తీసుకొస్తామని చెబుతున్న మోదీ స్వదేశంలో వెలికి తీసిన నల్లడబ్బు ఎంతన్నది మాత్రం పెదవి విప్పడం లేదు. కొత్తనోట్లు వచ్చిన కొత్తలో సామాన్యుడికి ఒక్క నోటు దొరకడం ఎంత దుర్లభమైందో, కొంతమంది బడాబాబుల వద్ద మాత్రం గుట్టలు గుట్టలుగా కొత్తనోట్లు లభించాయి. వారి వద్దకు ఆ నోట్లకట్టలు ఎలా వచ్చాయన్నది కూడా గత వంద రోజులుగా సామాన్యుడికి అర్థం కాని విషయమే. పెద్దనోట్లు రద్దు చేసింది ఇందుకేనా? కష్టాలన్నీ పేదలకేనా? కరెన్సీ కట్టలు సంపన్నులకేనా? అన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. పెద్దనోట్లను రద్దు చేయడం తప్పుడు నిర్ణయం అన్న వ్యతిరేకత జనం నుంచి వచ్చేలోగా ‘నగదు రహితం- అదే ప్రజలకు హితం’ అంటూ మరో నినాదంతో పాలకులు కొత్తకథలు చెప్పుకొచ్చారు.
ఎటిఎంల ద్వారా జరిపే లావాదేవీలపై అధిక మొత్తంతో చార్జీలను ప్రజలకు తెలీకుండానే వసూలు చేస్తున్నారు. దీనిపై కూడ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదు. ఏం జరిగిందో సామాన్యుడికి తెలిసేలోపే అనేక నష్టాలు జరిగిపోయాయి. కొన్ని కుటుంబాల్లో పెళ్లిళ్లు సైతం ఆగిపోయాయి. ఏదో వరాల జల్లు కురిపించినట్లు పెళ్లిఖర్చులకు ఒకేసారి రెండున్నర లక్షల రూపాయలు పొందవచ్చు అంటూనే దానికి కూడ అనేక షరతులు పెట్టారు. ఈ దెబ్బతో కొన్ని పెళ్ళిళ్ళు ఆగిపోతే, మరికొన్ని వాయిదాపడ్డాయి. పెళ్లి ఖర్చులకు రెండున్నర లక్షలు ఏ మూలకు సరిపోతాయన్న విమర్శలూ వచ్చాయి. ఖరీదైన ఏసీ కార్లలో తిరిగే నేతలకు సామాన్య, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులు ఎలా తెలుస్తాయి? సడలింపులు, షరతులతో కాలక్షేపం చేశారే తప్ప పెద్దనోట్ల రద్దుతో గత వంద రోజుల్లో ఏం సాధించారన్న విషయం పాలకులు చెప్పడం లేదు. నోట్లరద్దు వ్యవహారం నూరు రోజులు గడిచినా అర్థం కాని కథలా మిగిలింది.

- శశికాంత్