Others

చిన్నారులలో పెరుగుతున్న మధుమేహం --- వార్త-వ్యాఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుమేహం (డయాబెటీస్) అనేది అత్యంత క్లిష్టమైన మెటబాలిక్ వ్యాధి. వయసు, లింగభేదాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఇది వస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలు పెరిగే ఈ స్థితి (హైపర్‌గ్లిసెమియా అని అంటారు) ఏర్పడటానికి కారణం పాన్‌క్రియాసిస్ సరి అయిన రీతిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం లేదా దానిని సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవడం (ఇన్సులిన్ రెసిస్టెన్స్). రెండు రకాల మధుమేహాలు ఉన్నాయి. అవి టైప్ 1, టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ లేదా జువెనిల్ డయాబెటీస్ సాధారణంగా చిన్నారులు (10-15 సంవత్సరాలు)లో కనిపిస్తే, టైప్ 2 డయాబెటీస్ పెద్దవారు (18-40 సంవత్సరాలు)లో కనిపిస్తుంది. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, శారరీక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటివి చిన్నారులు సైతం టైప్ 2 డయాబెటీస్ బారిన పడేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి. అంతర్జాతీయ చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. డయాబెటాలజిస్ట్, జీపీలకు ఇది ఓ సవాల్‌గా పరిణమిస్తుంది.
ఎన్నో అధ్యయనాలు తెలిపేదాని ప్రకారం చిన్నారులలో చక్కెర వ్యాధి రావడానికి అధిక బరువు లేదంటే ఒబేసిటీ కారణం. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, కుటుంబ సభ్యులు అధిక బరువు కలిగి వుండటం, అరుదుగా వైద్య సంబంధిత కారణాలు కూడా మధుమేహ కారకాలు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామాల రీత్యా శక్తిని ఖర్చుపెట్టడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించవచ్చు. యుఎస్ ప్రివెంటేటివ్ సర్వీసెస్ టాస్క్ఫోర్స్ (యుఎస్‌పిఎస్‌టిఎఫ్) 2010లో ఆరేళ్లకే చిన్నారులకు ఒబేసిటీ పరీక్షలను చేయాలని సూచించింది. ఒకవేళ వారు ప్రమాణాలను అధిగమిస్తే వారికి తప్పనిసరిగా ఓ మోస్తరు నుంచి తీవ్రమైన (25 గంటలు లేదా అంతకన్నా అధికమైన) డైట్, ఫిజికల్ యాక్టివిటీ వంటి వాటితో పాటుగా ఒబేటీ ట్రీట్‌మెంట్స్ కూడా అందించాలని పేర్కొంది. అయితే వాస్తవానికి ఐదేళ్ల చిన్నారులలో కనిపించే ఊబకాయం తరువాత కాలంలో వచ్చే ఊబకాయాన్ని ఊహిస్తుంది. అందువల్ల చిన్నతనంలో ఊబకాయ పరీక్షలు చేయడంతోపాటుగా ఆ పరీక్షలను తప్పనిసరిగా చేయాల్సి ఉంది.
-డా శ్రీదేవి పాలడుగు

ఆ వూళ్లో కార్ల సంఖ్య అపారం!

ప్రపంచం మొత్తంమీద చిన్న దేశం ఒకటుంది. దాని పేరు ‘శాన్ మెరీనో’. దేశం పేరు, రాజధాని పట్టణం పేరూ ఒక్కటే. ఆ వూరు ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల అతి బుల్లి రిపబ్లిక్. అతి సంపన్న బుల్లిరాజ్యం. అందుకే రుూ శాన్‌మెరీనోలో మనుష్యులకన్న మోటారు శకటాల సంఖ్య ఎక్కువ. అంటే, బే‘కార్’ గాళ్లు లేరన్నమాట!
ఈ దేశంలో ప్రతి వెయ్యిమంది జనాభాకీ 1263 మోటారు కార్లున్నాయి. మనం హైదరాబాద్‌లో ప్రతి ముగ్గురికీ ఓ ‘కారుంది’ అంటూ దుఃఖిస్తాం కానీ, శాన్‌మెరీనో వాసులు యించక్కా తలా ఒక కారు వాడుకుంటారు. ఎందుకంటే అక్కడ రోడ్లు అలా నున్నగా- దోసెలు వేసి తిరగవేసుకునేలాగా వుంటాయి. కాకపోతే జనాభానే తక్కువ- ముప్పయి నాలుగు వేలమంది మాత్రం.
పైగా దీని వైశాల్యం ఎంతనుకున్నారు? కేవలం అరవై ఒక్క చదరపు కిలోమీటర్లు. దీని చుట్టూ ఒక పరిధిలాగా ఇటలీ దేశం వుందిగానీ దురాక్రమణల భయం లేదు. కనుక యించక్కా కార్లు ఇటలీలోకి కూడా దూసుకుపోతూంటాయి!
ఆ స్కూల్లో అందరూ మామ్మ’లే!
అరవైకీ తొంభైకీ మధ్య వుంటుందా బామ్మల వయసు. ప్రొద్దునే్న రుూ వృద్ధ మాతలందరూ పలకా, బలపం పట్టుకుని- ముందు రోజు నేర్చుకున్న బాలగీతాలు, పల్లెపదాలూ నెమరువేసుకుంటూ- టంచన్‌గా ఆరు గంటలకల్లా (ఉదయం) ‘ఆజీబాయి చీశాలా’అంటే పెద్దమ్మల పాఠశాలకి ఉషారుగా చేరుకుంటారు.
ముంబాయి దరి ఠానే జిల్లా ఫాంగాణ అనే గ్రామంలో సుప్రభాత దృశ్యం ఇది. అదొక ప్రాథమిక పాఠశాల. అయితే అక్కడ ప్రవేశం కేవలం వయోవృద్ధ నారీమణులకే. (60-90) టీచర్లుమాత్రం నలభై అయిదు ప్రాయంలోపువారు. యోగేంద్రా బంగార్ (45) అనే టీచర్ ఒక ధర్మ సంస్థ సాయంతో రుూ షష్ఠిపూర్తి అనంతర విద్యాలయాన్ని స్థాపించింది.
ఈ స్కూలులో 30 మంది రెండో బాల్యంలోకి అడుగిడిగిన రైతు వనితలున్నారు. ఈ స్కూలుకో డ్రెస్ కోడ్ కూడా వుంది. అంతా ‘పింక్’ అనగా గులాబీ రంగు చీరలు రవికెలు ధరించాలి. తొంభయ్యవ పడిలో పడ్డ రమాబాయమ్మగారు చెప్పింది- కళ్లజోడు సర్దుకుంటూ, చెవిటి మిషను సరిచేసుకుంటూ- ‘‘నాకు తెలిసింది చదువు విలువ యివాళ.. వేలిముద్ర దాన్ని కాదు నేను యివాళ. కూడబలుక్కుని ఐనా మా మనుమల పుస్తకాలు చదివేస్తా. సంతకం కూడా పెడతా.. ‘‘పాల లెక్కలు, పిడకల లెక్కలు, వీటి ఖరీదులు, అమ్మకాలు అన్నీ రుూ అవ్వ సొంతంగా చేస్తుందిరా, అబ్బాయ్!’’ అంటూ గర్వంగా చెప్పింది.
కాంతమ్మగారికి అరవై అయిదు. ఆమెకి క్లాసులో సొంత కోడలు పిల్లే టీచరు. బ్లాకు బోర్డు యిచ్చారు ఒకరు. మరికొన్ని వస్తువులు, కుర్చీ, చాపలు వగైరా మరికొందరు, ‘వేలిముద్దర వెయ్యాలే ఆమ్మా!’’ అంటే మొట్టికాయ వేస్తుందో వృద్ధనారి. సంతకం చేస్తుందిప్పుడు. అయితే, ‘డిజిటలైజేషన్’ పుణ్యమాని మున్ముందు ‘అంగుఠా’ (నిశానీ) పెట్టాల్సి వస్తుంది అన్న సంగతి- రుూ సీనియర్ మోస్ట్ సిటిజన్ మహిళలకు తెలియదు!
మధ్యలో ఆగకుండా
పరుగులు!
పట్టణాలలో వుండేవారికి రైలు బండ్లు మధ్యలో ఆగకుండా మరో పట్టణానికి పరుగులు తీసే రైలుబండ్లు కావాలి. ‘నాన్‌స్టాప్’ అన్నది ఒక తారకమంత్రం రుూ రోజుల్లో.
గరీబ్థ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా ఆగకుండా పరుగులు తీస్తుంది అంటారు గానీ, అది బెజవాడలో ఓ కునుకు తీసి, రాజమండ్రీలో ఒక ఝలక్ యిస్తేగానీ వైజాగ్ చేరదు. అంటే నాన్‌స్టాప్ కాదన్నమాట.
దేశంలో రెండు పెద్ద స్టేషన్‌ల మధ్య, ఆగకుండా హడావుడిగా- దడదడా ప్రయాణం చేసే రైలుబండీ తిరువేండ్రం-నిజాముద్దీన్-రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బరోడా నుంచి ‘కోట’ స్టేషన్‌కి ‘ఆగని వేగమే ప్రయాణమూ’ అన్నట్లు 528 కిలోమీటర్లు దూరం ఎకాటకీన పరుగులు తీస్తుంది.
ఇండియా అంటే చాల నిడివి (వెడల్పూ) గల దేశం. ఒక రైలు వుంది. దాని పేరు దిబ్రూగర్ (అస్సాం) టు కన్యాకుమారి (కేరళ) ఎక్స్‌ప్రెస్- ‘ఆ రైలు దేశాన్ని నిలువుగా కొలుస్తుందా?’ అన్నట్లు 4,200 కి.మీ దూరం నడుస్తుంది. ఈ ప్రస్థానానికి ఆ ఎక్స్‌ప్రెస్ తాపీగా 85 గంటలు మాత్రమే తీసుకుంటుంది. దేశంలో దూర ప్రయాణీకులు యిప్పటికీ రైలుబండ్లనే ఎంచుకుంటారు. సరే! అతి చిన్న పేరున్న స్టేషన్ ఒకటుంది. అది ఒరిస్సాలో ఝార్సుగూడ దగ్గరలో వుంది. దాని పేరు రెండే అక్షరాలు ‘ఈబ్’. ‘తుని’ స్టేషన్ కూడా రెండక్షరాలే గానీ దానికి ‘కొమ్ము’ ఎక్కువ! ఐతే దేశం మొత్తంమీద కొండవీటి చాంతాడంత పేరున్న స్టేషన్ ఒకే ఒక్కటుంది. అది ఆంధ్రప్రదేశ్‌లోనే వుందిగానీ దాని పేరు- ‘వేంకట నరసింహరాజువారిపేట’. మొత్తం 28 అక్షరాలు. కాకపోతే అక్కడా యిక్కడా కూడా ఫ్లాట్‌ఫాం టికెట్ వెల పది రూపాయలే. చిన్నా పెద్దా తేడా ఏమీ లేదు.

-వీరాజీ