Others

మధురమైన షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ర్యాంప్‌పై విభిన్నమైన దుస్తులతో అందమైన భామలు అడుగులు వేస్తూంటే మనసు ఎటో వెళ్లిపోతుంది. సృజనాత్మకత, సందేశం, అభిరుచి, సంప్రదాయం, నవకల్పనలకు ఈ దుస్తులు అద్దం పడతాయి. పారిస్‌కు చెందిన ప్రముఖ సంస్థ సలన్ డు చాక్‌లెట్ నిర్వహించే చాక్‌లెట్ ఫ్యాషన్ షో అలాంటిదే. నేత వస్త్రాల నుంచి సిల్క్, చివరకు పేపర్ దుస్తులు, బ్యాగ్‌లు, పాదరక్షలు.. ఒకటేమిటి అందానికి అక్కరకొచ్చేవన్నీ ఎప్పటికప్పుడు కొత్తరూపు సంతరించుకుంటూనే ఉన్నాయి. నిమిషానికో కొత్త ఫ్యాషన్‌కు పారిస్ పెట్టిందిపేరు. ఆధునిక భారతంలో ఇప్పుడిప్పుడే ఈ ఫ్యాషన్ ప్రపంచం రెక్కలు విప్పుకుంటోంది. విదేశీ ర్యాంప్‌లపై బాలీవుడ్ భామలు ప్రియాంకచోప్రా, దీపిక పదుకొనే వంటి తారలు మిలమిల మెరుస్తున్నారు. మనవాళ్లు క్యాట్‌వాక్‌లో తొలి అడుగులు వేస్తున్న వేళ పాశ్చాత్య ప్రపంచం సరికొత్త ట్రెండ్‌తో నడక మార్చింది. చాక్‌లెట్ దుస్తులు, అలంకరణ సామగ్రి, పాదరక్షలు, వ్యానిటీ బ్యాగులు ఇలా ఒకటేమిటి సౌందర్య సాధనాలన్నీ చాక్‌లెట్‌తో తయారు చేసినవే ధరించి అందానికి మాధుర్యాన్ని జోడించారు. న్యూయార్క్, లండన్, పారిస్, జపాన్, బీరుట్ ఇలా ఇప్పటివరకు ఆరేడు దేశాల్లో ఇలాంటి చాక్‌లెట్ ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. ఏటా లండన్, న్యూయార్క్‌లలో నిర్వహించే చాక్‌లెట్ ఫ్యాషన్ షోలకు హాజరవడం గౌరవంగా భావించే మోడల్స్ తమతమ ఆలోచనలకు పదునుపెడుతున్నారు. ప్రఖ్యాత డిజైనర్లు తన సృజనకు చాక్‌లెట్ రూపమిస్తున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో నిర్వహించిన షోకు హాజరైన అందమైన చాక్‌లెట్ భామలను చూస్తే మధుర భావనలు ముంచెత్తుతాయి.