Others

నోరు, చేతులూ కట్టేసిన టీచర్! ( వార్త- వ్యాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటువ్యాధులలాగే చెడ్డ, క్రూరమైన అలవాట్లు, చేష్టలు కూడా ప్రపంచమంతటా ఒక్కలాగే వ్యాపిస్తాయి అనిపిస్తోంది. థాయ్‌ల్యాండ్‌లోని ‘సురిన్’ అనే పట్టణంలో చిన్నారుల పెద్ద పాఠశాల ఒకటుంది. అందులో సహజంగానే అల్లరి పిల్లలుంటారు. ఒక క్లాసులో ఇద్దరు టీచర్లు కాపలా కాస్తూ పాఠాలు వల్లె వేయిస్తూ వున్నా- యిద్దరు పిల్ల పిడుగులు- కాగితాలు తీసుకుని వాటిని పరపరా చింపి పట పటా చప్పుడు చేస్తూ చింపేసి- ఆ విచిత్రమైన శబ్దానికి కేరింతలు కొడుతూ అల్లరి చేశారు.
అధ్యాపికాద్వయానికి వొళ్లంతా తేళ్లూ జెర్రులూ ప్రాకినట్లయింది. చెలరేగిపోయి ఛడామడా తిట్టిపోస్తూ రుూ భడవలిద్దర్నీ పట్టుకుని, అదిలించి, విదిలించి, గదమాయించి యింకా ‘కసి’ తీరక- చివరికి వాళ్ల కళ్లకి కాగితాలు అంటించి, గంతలు కట్టి, టేపు వేసి అతికించి- అంతటితో ఆగక- చేతులకు కూడా రిబ్బన్లు కట్టేశారు. ఈ శాడిస్టు గోల చూస్తున్న మరో టీచర్, తన మొబైల్‌కి పని చెప్పింది. ఆ ఫొటోలను యాజమాన్యానికి అందజేసింది.
తల్లిదండ్రులు పోలీసులను శరణుజొచ్చారు. ఎందుకంటే హెచ్.ఎమ్.గారు కూడా ‘‘అల్లరి పిల్లల్ని శిక్షించడంలో తప్పేముంది? అదేమంత ఘోర నేరమా?’’ అన్నది ‘కూల్’గా!
పోలీసులు ఆ టీచర్లని పట్టుకుపోయారు. సరే, గొడవ అనంతరం టీచర్లకి చెరో ఇరవై వేల థాయిల్యాండ్ రూపాయలు (975 బ్రిటీష్ పౌండ్లకి సమానం) జరిమానాగా వేసి ఆ పిల్లల తల్లిదండ్రులకు యిప్పించారు. టీచర్లు ‘‘మాకు ట్రాన్స్‌ఫర్ ఇప్పించండి మహాప్రభో!’’ అని మొరపెట్టుకున్నారు. కాకపోతే స్కూలు యాజమాన్యం రుూ టీచర్ల పేర్లను టీవీలకీ, పేపర్లకీ యివ్వలేదు. బారాది కాలం భవిష్యత్తు వుంది- టీచరమ్మలకు. ‘‘లెట్ దెమ్ గో’’ అన్నారు- గ్రేట్!

-వీరాజీ